వరంగల్

జాబ్‌కార్డున్న ప్రతి కూలీకి ఉపాధి హామీ పని కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్ ఘన్‌పూర్, జూన్ 16: జాబ్‌కార్డు ఉన్న ప్రతి కూలీకి ఉపాధి హామీ పనిని కల్పించాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మండలంలోని ఫత్తేపూర్, చిన్నపెండ్యాలలో ఉపాధిహామీ పధకంలో భాగంగా చేపట్టిన ఇంకుడుగుంతలు, సేధ్యపుకుంటలు, నర్సరీ పెంపకాలతో ఆయా ఫోటో ఎగ్జిబిషన్‌ను గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధీ కూలీలకు పలు సూచనలు, సలహాలు ఇస్తూ, మీగ్రామాల్లో 50 శాతం పనులు పూర్తి చేస్తే గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులను మంజూరీ ఇస్తానంటూ పలు నజరానాలు ప్రకటించారు. అనంతరం చిన్నపెండ్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి కుటుంబం వందరోజుల కూలీపనులను చేయాలన్నారు. ఉపాధిహామీ పధకంలో ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రధానమైనది ఇంకుడుగుంతలు, సేద్యపుకుంటలు, మొక్కల పెంపకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రభుత్వం మంజూరీ ఇస్తున్న నిధులతో గ్రామాల్లోని ప్రత ఇంటిలో ఇంకుడుగుంత, వ్యవసాయ భూముల్లో సేద్యపుకుంటలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రానున్న వర్షాకాలంలో వచ్చిన వర్షపునీరును కాపాడుకోగలుగుతామన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. పెరిగిన భూగర్భ జలాలు తాగునీటికే కాకుండా, సాగుకు ఉపయోగపడుతాయన్నారు. అంతేకాక కాలుష్య నివారణతో పాటు వర్షాభావ పరిస్థితులు అనుకూలించాలంటే మొక్కల పెంపకం ప్రధానమైందన్నారు. మొక్కల పెంపకానికి ఉపాధిహామీ పధకంలో భాగంగా ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరీ చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమపథకాలతో పాటు, నిరుపేద కుటుంబాలకు చెందిన కూలీలకు కల్పిస్తున్న వంద రోజుల పనిదినాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వంద రోజుల పనిదినాలతో పాటు మరో 50 రోజుల పనిదినాలను పెంచేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో పంచాయితీరాజ్ కమీషనర్, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, స్థానిక ఎమ్మెల్యే డాక్టరు రాజయ్య, జిల్లా కలెక్టరు వాకాటి కరుణ, డ్వామా పడి శేఖర్‌రెడ్డి, స్థానిక జడ్పిటిసి భూక్యాస్వామినాయక్, ఎంపిపి జగన్మోహన్‌రెడ్డి, ఎంపిడిఓ సంపత్‌రావు, తహాశీల్దారు సదానందం, ఎపిఓ విద్యావతి, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.