వరంగల్

కౌలు రైతులకు రుణ అర్హతకార్డుల జారీ: కలెక్టర్ కరుణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, జూన్ 16: జిల్లాలో అర్హత కలిగిన కౌలు రైతులకు రెవెన్యూశాఖ ద్వారా రుణ అర్హత కార్డులు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. రుణ అర్హత కార్డులను కౌలు రైతులు సంబందిత సమీప బ్యాంకు బ్రాంచీలలో సమర్పిస్తూ రుణాలు పొందవచ్చు అని అన్నారు. బ్యాంకు అధికారులు రుణ అర్హత కార్డులు కలిగిన కౌలు రైతులకు రుణాలు అందించాలని అధికారులను సూచించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ రుణాలుగా 3251కోట్ల రూపాయలను రైతులకు అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. జూన్, జులై మాసలలో వర్షాలు కురిసి రైతులు విత్తనాలు నాటనున్నందున బ్యాంకులు రైతులకు రుణాలను విరివిగా అందించి తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించాలని కలెక్టర్ సూచించారు.