వరంగల్

వనసంపదతోనే మానవాళి మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగుళ్ళపల్లి, జూలై 14: మానవాళి మనుగడకు వృక్ష సంపద అవసరమని వాటి కారణంగా పడే వర్షాలతో కరవు పరిస్థితులు లేకుండా సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం మండలంలోని గణేష్‌పల్లి శివారులో హరితహారం సందర్భంగా పర్లపల్లి రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఒకప్పుడు అవసరమైన వర్షాలు పడిన కారణంగా కరువు పరిస్థితులు లేకుండా పంటలతో మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందాయని అలాంటిది ప్రస్తుతం కరువు పరిస్థితులతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తలడిల్లిపోతున్నాయంటే కారణం వర్షాభావ పరిస్థితులేనని అందుకోసం ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 47 కోట్ల మొక్కలు నాటి హరిత తెలంగాణ సాధించాలనే లక్ష్యంగా ముందుకు వచ్చారని అన్నారు.
అందుకు అనుగుణంగా భూపాలపల్లి నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొగుళ్ళపల్లి మండలంలో 3లక్షల మొక్కలను నాటేందుకు 20 గ్రామాల్లో కార్యక్రమాన్ని ముమ్మరం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్‌పల్లి సర్పంచ్ వేముల సౌందర్యసదానందం, హరితహారం నియోజకవర్గ ఇన్‌చార్జి
మొక్కలు విరివిగా నాటాలి
పరకాల: మొక్కలే సర్వప్రాణులకు జీవనాధారమని పరకాల సిఐ బి. మల్లయ్య అన్నారు. గురువారం పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో చెరువు కట్ట మీద పోలీసుల ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి సుమారు 1000 మొక్కలు నాటారు. అదేవిధంగా పోచారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడి కేంద్రాలు, గ్రామంలో మరో 1000 మొక్కలు గ్రామస్తులతో కలిసి సిఐ నాటారు. ఈ సందర్భంగా సిఐ బి. మల్లయ్య మాట్లాడుతూ వృక్షాలే లేకపోతే జీవజాలానికి మనుగడే లేదన్నారు. మొక్కలు విరివిగా నాటితే అడవులు పెరిగి వర్షాలు విస్తారంగా పడుతాయని, దీంతో వాతావరణ సమతుల్యత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దీపక్, పోలీస్ సిబ్బం ది, గ్రామస్తులు పాల్గొన్నారు.