వరంగల్

నీటి ఒప్పందాలు..‘మహా’ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, మార్చి 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో గోదావరి నది ప్రాజెక్టులపై చేసుకున్న ఒప్పందంలో ప్రజలకు తెలియని ఎన్నో మోసాలు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అభివృద్ద్ధి కమిటీ చైర్మన్ నరహరి వేణుగోపాల్‌రెడ్డి అన్నారు.
శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ అభివృద్ది కమిటి చైర్మన్ నరహరి వేణుగోపాల్‌రెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ప్రాణహిత ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించేందుకే రీ డిజైన్ పేరుతో ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. 160 టిఎంసిల నిలువగల ప్రాజెక్టును 20 టిఎంసిలను తగ్గించి 140 టిఎంసిల నిలువతో కాళేశ్వరం వద్దగల మేడిగడ్డ ప్రాజెక్టును చేపట్టడం వలన నష్టం జరుగుతుందన్నారు. ప్రాజెక్టుల పాత ఒప్పందాలను రీ డిజైన్ చేసుకునేందుకే కెసిఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టుకు మూడు కిలోమీటర్ల దూరంలో కంతనపల్లి ప్రాజెక్టు ఎత్తు పెంచి దేవాదుల నుండి నగరానికి నీరు అందిస్తామని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు సరిపోదని, ఇలాంటి సమయంలో దేవాదుల నుండి వరంగల్ నగరానికి నీరు అందిస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడం కాదా అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు నుండి జిల్లాలోని చింతగట్టు ఎస్సార్‌ఎస్పీ కాలువకు లింక్ కలపడం ద్వారా నగర ప్రజలకు తాగునీరు అందించవచ్చన్నారు. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం నుండి వరంగల్ నగరానికి ప్రాజెక్టుల పేరిట వేల కోట్ల రూపాలయలు మంజూరు అయ్యాయని, ప్రాజెక్టుల, పరిశ్రమల నిర్మాణ, నిర్వాహణకు నీరే ప్రధానమన్నారు.మహానీటి ఒప్పందంతో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్ నియోజకవర్గాలకే నీరు అందే విధంగా కుట్రపూరిత పథకం వేశారన్నారు. జిల్లాలో 11 వందల మెగావాట్ల విదుత్తు ఉత్పత్తి అవుతుండగా జిల్లాలోని రైతులకు తొమ్మిది గంటల విద్యుత్తును అందించలేకపోవడం సిగ్గుచేటన్నారు. జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి మార్చి నుండి రైతులను తొమ్మిది గంటల నిరంతర విద్యుత్తును అందిస్తానని చెప్పిన మాట ఏమైందన్నారు. రాజకీయాలకు అతీతంగా మహానీటి ఒప్పందంలో జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు జిల్లాలోని అన్ని పార్టీల నాయకులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
గత ఎన్నికల కంటే మొన్నటి గ్రేటర్ ఎన్నికలలో బిజెపికి ఓటింగ్ శాతం పెరిగిందని, రాబోయే రోజులలో అభివృద్ద్ధిని ఆకాంక్షిస్తూ ప్రజలు భాజపా వెంట నడుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త దశరథం, దిలీప్‌నాయక్, త్రిలోకేశ్వర్ తదితరుల పాల్గొన్నారు.