వరంగల్

సమష్టిగా విధులు నిర్వర్తిస్తే మెరుగైన ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 2: పోలీసు అధికారులు, సిబ్బంది సమిష్టిగా విధులు నిర్వర్తిస్తే పోలీసు కమిషనరేట్ పరిధిలో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించిన సందర్భంగా బుధవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అభినందన సభలో గత నెలలో జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కమిషనరేట్ పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహించిన విధుల తీరుపై పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ సందర్బంగా కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతోనే ఉప ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోగలిగామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు కమిషనరేట్ పోలీస్ విభాగానికి ఎన్నికల కమిషన్ నుండి అభినందనలు తెలియజేయడం సంతోషాన్ని కలిగించిందన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో శ్రమించి ఎన్నికలను విజయవంతం చేయడంలో సఫలీకృతలయ్యారన్నారు. ముఖ్యంగా నగర స్పెషల్ బ్రాంచ్ విభాగం పూర్తిస్థాయిలో ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో కీలకంగా నిలిచారన్నారు. ఇదే తరహాలో రాబోవు ఎన్నికలను నిర్వహించడంలో అధికారులు, సిబ్బంది సన్నద్ధులు కావాలని సూచించారు. అనంతరం ఏసిపి స్థాయి అధికారుల నుండి హోంగార్డ్ స్థాయి కింది సిబ్బంది వరకు కమిషనర్ వ్యక్తిగతంగా అభినందిస్తూ వారికి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్, హన్మకొండ, వరంగల్, కాజీపేట, క్రైం, ఆర్మూడ్ రిజర్వు ఏసిపిలు రవిందర్‌రావు, శోభన్‌కుమార్, సురేంద్రనాధ్, జనార్దన్, ఈశ్వర్‌రావు, రమేష్, పరిపాలన అధికారి స్వరూపరాణి, సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, కల్పనారెడ్డి, ఉమేష్‌కుమార్‌తో పాటు ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

ఆకలిలేని సమాజాన్ని నిర్మిద్దాం
*కలెక్టర్ వాకాటి కరుణ
నక్కలగుట్ట, డిసెంబర్ 2: సమాజంలో పేదరికంతో తిండి లేకుండా బాధపడే వారిపై అందరూ దృష్టి సారించి బియ్యం దానంచేసి ఆకలిలేని సమాజాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని కలెక్టర్ వాకాటి కరుణ పిలుపునిచ్చారు. బుధవారం కాకతీయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వాకర్స్ అసోషియేషన్ అధ్వర్యంలో గుప్పెడు బియ్యం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా 10 క్వింటాళ్ల బియ్యాన్ని సేకరించారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా వరంగల్, హన్మకొండ పరిధిలో గల ఐదు అనాధ ఆశ్రమాలకు, ఒక్కొక్క ఆశ్రమానికి రెండు క్వింటాళ్ల చొప్పున అందించారు. ఈ సందర్బంగా వాకాటి కరుణ మాట్లాడుతూ సమాజంలో ఆకలితో బాధపడే వారికి మనందరం ఉన్నామనే భరోసా కల్పించాలని అన్నారు. ఆ భరోసా కల్పించేందుకు గుప్పెడు బియ్యం కార్యక్రమం లాంటివి ఎంతో దొహదపడతాయని తెలిపారు. బియ్యాన్ని కేవలం వాకర్స్ మాత్రమే కాకుండా పౌరులందరూ వీలైనంతగా బియ్యాన్ని అందజేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అసోషియేషన్ అధ్యక్షుడు సుధాకర్‌రావు, లక్ష్మీనారాయణ, ఆచార్య దిగంబరరావు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష
ఏటూరునాగారం,డిసెంబర్ 2: సమగ్ర గిరిజనాభివృద్ది సంస్ధ పరిధిలో జరుగుతున్న 13వ ఆర్ధిక సంవత్సర పనుల అభివృద్దిపై జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అధికారులతో సమీక్షించారు. బుధవారం స్ధానిక ఐటిడిఎ కార్యాలయంలో పిఒ అమొయ్‌కుమార్ అద్యక్షతన అభివృద్ది పనులపై సమావేశం జరిగింది. ఈసమావేశానికి హాజరైన కలెక్టర్ కరుణ ఆర్‌డబ్ల్యూ ఎస్, ఆర్‌అండ్‌బి, విద్యుత్, ఇంజనీరింగ్, మైనర్ ఇరిగేషన్, పంచాయితీరాజ్, ఎన్‌హెచ్, విద్య, వైద్య ఆరోగ్య, ఐకెపి, టిఎండిసి అధికారులతో అభివృద్ది పనుల పురోగతిపై సమీక్షించారు. డ్రింకింగ్ వాటర్, విద్యుత్ సరఫరా, జాతీయ రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఎంఐ ఈఈ సుధీర్ మిషన్ కాకతీయ పధకం ద్వారా మొదటి విడతగా148 చెరువులకు గాను 63 చెరువులను పూర్తి చేశామని, మిగతావి ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయని తెలిపారు. రెండవ దశగా 150 చెరువులకుగాను 61 చెరువులకు ఎస్టిమేట్‌లు పూర్తయ్యాయని మిగతావి డిసెంబర్‌లోగా ఎస్టిమేట్‌లు పూర్తవుతాయన్నారు. ఎన్‌హెచ్ అధికారులు మాట్లాడుతూ మేడారం జాతరకు సంబందించిన రోడ్లకు పాచ్ వర్కులు జరుగుతున్నాయని, చిన్నబోయినపల్లి వద్ద రోడ్డు పనులు , కల్వర్టు పనులు జరుగుతున్నాయని వివరించారు. జిల్లా వ్యాప్తంగానున్న 69 పిహెచ్‌సిలలో 100% డెలివరీలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సాంబశివరావుకు సూచించారు. ఐటిడిఎ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో మరుగుదొడ్లు, డ్రింకింగ్ వాటర్ వసతులు తప్పక ఉండాలని టిడబ్ల్యూ ఈఈ కోటిరెడ్డిని ఆదేశించారు. అంగన్‌వాడి కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఐసిడిఎస్ పిడి, సిడిపిఒలను మందలించారు. అంతేకాకుండా ఐటిడిఎ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్ధులకు స్పెషల్ తరగతులు నిర్వహించి విద్యా శాతాన్ని పెంచాలన్నారు. సమావేశంలో ఎపిఒ వసంతరావు, ఆర్డీఒ మహేందర్‌జీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ రాజేంద్ర కుమార్, ట్రాన్స్‌కో ఓస్ ఈ టి.మధుసూదన్, ఎన్‌హెచ్ ఈఈ సత్యనారాయణ, ఐకెపి ఎపిడి రాజేంద్ర ప్రసాద్, ఎండిసి అధికారి తారక్, ఐసిడిఎస్ పిడి సబిత ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఓరుగల్లు ప్రజలు సిఎంకు మనోధైర్యమిచ్చారు
*కోడ్ ముగియగానే వరంగల్‌కు మహర్దశ
*్భరీ పథకాలకు సిఎం శంకుస్థాపనలు
*6న విజయోత్సవ సభ
*జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, డిసెంబర్ 2: ఉప ఎన్నిక ఫలితం టిఆర్‌ఎస్ గౌరవాన్ని మరింత పెంచిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవిందర్‌రావు అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఫలితం ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వరంగల్ ప్రజలు మరింత మనోధైర్యాన్ని ఇచ్చారని, అందుకు ప్రతిగా ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలోనే వరంగల్ జిల్లాకు భారీ వరాల జల్లులు కురిపించనున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే వరంగల్ ఔటర్‌రింగ్‌రోడ్డు, టెక్స్‌టైల్ పార్క్ లాంటి అనేక పథకాలకు నాంధి పలుకుతారని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కువ సమయాన్ని వరంగల్‌కే కేటాయించనున్నట్లు తమతో చెప్పారని వెల్లడించారు. ఉప ఎన్నికలో ఘనవిజయాన్ని సాధించిన సందర్భంగా ఈ నెల 6న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసభకు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరితో పాటు ఎన్నికల సందర్భంగా ఏడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు పాల్గొనడమే కాకుండా ఎంపిటిసి, జెడ్పిటిసి, కౌన్సిలర్లు, పార్టీ ముఖ్యనాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. విజయోత్సవ సభకు ఒకరోజు ముందుగానే జిల్లాలో మంత్రులు సమావేశమై భవిష్యత్ కార్యక్రమాన్ని చర్చించుకుంటారని ఆయన అన్నారు. ఉప ఎన్నికలో జిల్లా నాయకులంతా ఒక్కతాటిపై ఉండడం వల్లే ఇంతటి భారీ విజయాన్ని సాధించగలిగామని, అందుకు తోడు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యాయనే సంకేతం ఈ ఎన్నికల ఫలితాల ద్వారా వచ్చిందన్నారు. ప్రభుత్వ పనితీరుకు ఉప ఎన్నికల ఫలితాలే గీటురాయిగా ఓటర్లు తీర్పు ఇచ్చారన్నారు. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఏకపక్షమే అవుతుందన్నారు. తాను కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నానని, అధిష్టానం తన సేవలను గుర్తించి తనకే టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నానని అయితే అధినేత టికెట్ ఎవరికి ఇచ్చిన ఉప ఎన్నికల ఫలితాల విధంగానే ముందుకు పోతామన్నారు. స్థానిక సంస్థల్లో ప్రతిపక్షాలకు బలం లేనందున ఏకగ్రీవానికే మొగ్గుచూపుతారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. 860 ఓటర్లలో 600పైగా ఓట్లు తమవే ఉన్నాయని చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో పార్టీ నాయకులు కోలె జనార్దన్, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేటి నుండి అవినీతి వ్యతిరేక వారోత్సవాలు
*ఎసిబి డిఎస్పీ సాయిబాబా
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, డిసెంబర్ 2: ఈ నెల 3 నుండి 9 వరకు అవినీతి వ్యతిరేక వారోత్సవాలను నిర్వహించనున్నట్లు ఏసిబి డిఎస్పీ సాయిబాబా తెలిపారు. బుధవారం ఏసిబి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని వివిధ పాఠశాలల, కళాశాలల, డిగ్రీ, పిజి కళాశాలలకు చెందిన విద్యార్థులకు అవినీతి నిర్మూలనలో ప్రజల పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా దేశ అభివృద్ధికి అవినీతి ప్రధాన శత్రువు, అవినీతి నిర్మూలనకు వ్యక్తిగత నైతిక విలువలు అవసరం అనే అంశాలపై కూడా వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో వివిధ మండలాల్లో కళాబృందాలచే ప్రదర్శనలు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అదాలత్ సెంటర్ వరకు ర్యాలీలు లాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నెల 4న హైస్కూల్, జూనియర్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, 5న డిగ్రీ కాలేజ్, ప్రొఫెషనల్ కాలేజ్, యూనివర్సిటీ విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహిస్తామన్నారు. 7,8వ తేదీల్లో కళాకారులచే మండలాల్లో కళాప్రదర్శనలు ఉంటాయని, 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీల్లో ఎంపికైన విద్యార్థులకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, జిల్లా జడ్జి, రూరల్ ఎస్పీ చేతుల మీదుగా బహుమతుల ప్రధానం ఉంటుందన్నారు. ఎంతటి వ్యక్తులపైనైనా ఖచ్చితమైన ఆరోపణలు వచ్చినట్లయితే అలాంటి వారిపై ఏసిబి దాడులు ఉంటాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

అంగ వైకల్యం మనిషికే కాని మనసుకు కాదు
వడ్డేపల్లి, డిసెంబర్ 2: సమాజంలో వికలాంగులపట్ల న్యూనతా భావం తగదని, అంగ వైకల్యం మనిషికే కాని మనసుకు కాదని వికలాంగుల శాఖ సహాయ సంచాలకులు కేశవరెడ్డి అన్నారు. బుధవారం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ అధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేశవరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వారు వికలాంగులకు ఉచితంగా కంప్యూటర్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి నేర్పించి వారి సామర్థ్యాన్ని పెంపొందించేలా చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. నేటి ఆధునిక యుగంలో పోటీ తత్వానికి ధీటుగా ఇటాంటి శిక్షణలను తీసుకోవడం ద్వారా వారికి మానసిక ధైర్యం పెరుగుతుందని తెలిపారు. జ్ఞానార్జనలో వారు ఇతరులకంటే కూడా ముందుంటారని గుర్తుచేశారు. సమాజంలో వారికంటూ మంచి స్థానం ఉండేలా ప్రతివారు సహరించాలని అన్నారు. అంతేకాకుండా క్రీడలలో కూడా వారు రాణించే విధంగా కృషి చేయాలని తెలిపారు. వికలాంగులను అనాదరణకు గురిచేసే వారిని భగవంతుడు కూడా క్షమించడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా మరియు అటవీ శాఖ అధికారి పురుషోత్తం, రెడ్డీస్ ఫౌండేషన్ మేనేజర్ విజయలక్ష్మీ, సిబ్బంది మధు, సౌమ్యారాణి, కుమారస్వామి, క్రాంతి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
*వార్ వన్ సైడే
*టిఆర్‌ఎస్‌లో టికెట్ కోసం పోటాపోటీ
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, డిసెంబర్ 2: స్థానిక సంస్థల కోటాలో 12 మంది శాసనమండలి సభ్యులుగా ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ విడుదల అయింది. వరంగల్ జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్సీ స్థానం ఉండడంతో అధికార పార్టీ నుండి ఆశా వాహులు ఎక్కువ మంది ఉన్నారు. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుండే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 27న పోలింగ్, 30న కౌంటింగ్ చేపట్టి అదే రోజు ఫలితాలను విడుదల చేస్తారు. జిల్లాలో మొత్తం 860 మంది ఓటింగ్ అవకాశం ఉంది. అందులో జెడ్పిటిసిలు 50, ఎంపిటిసిలు 687, కౌన్సిలర్లు 116, ఎక్స్ అఫిషియో ఏడుగురికి అవకాశం ఉంది. కాగా వరంగల్ కార్పొరేషన్‌కు గత రెండేళ్లకు పైగా ఎన్నిక నిర్వహించకపోవడంతో కార్పొరేటర్లకు పోటీ లేకుండా పోయింది. జిల్లాలోని మంగపేట, హన్మకొండ మండలాల్లో కోర్టులో వాజ్యం ఉన్నందున ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో అక్కడి ఎంపిటిసిలకు ఓటు హక్కు లేదు. మెజార్టీ స్థానాలు టిఆర్‌ఎస్‌కే ఉండడంతో గెలుపు ఏకపక్షమయ్యే అవకాశాలు ఉన్నాయి. 860 ఓట్లకు గాను దాదాపు 600 ఓట్లు అధికార పక్షానికే ఉండడంతో ఇక టిఆర్‌ఎస్ నుండి టికెట్ ఎవరికి ఖరారైతే వారే ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఖాయంగా తేలిపోయింది. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందోనని టిఆర్‌ఎస్ ఆశావాహుల్లో ఉత్కంఠం నెలకొంది. మరో మూడు రోజుల్లో అధికారికంగా టి ఆర్ ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉండడంతో ఆశావాహులంతా వారివారి గాడ్ ఫాదర్ల ద్వారా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రేసులో జిల్లా పార్టీ అధ్యక్షులు రవిందర్‌రావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముద్దసాని సహోదర్‌రెడ్డి, కనె్నబోయిన రాజయ్యయాదవ్, గుడిమళ్ల రవికుమార్ తదితరులు ఉన్నారు. కాగా బుధవారం తొలిరోజు ఎవరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదని రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల మధ్య నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చని ఆయన తెలిపారు.

మారుతున్న రాజకీయ పరిణామాలతో
వామపక్షాల్లో గుబులు...!
* వైసిపి పోటీలో ఉంటే కష్టమే...
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 2: స్థానిక సంస్థలకోటాలో శాసనమండలి స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో మారుతున్న రాజకీయ పరిణామాలు వామపక్ష పార్టీల్లో గుబులు రేపుతున్నాయి. జిల్లాలో అత్యంత బలం కలిగిన వామపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా సిపిఐ నేత పువ్వాడను ఎమ్మెల్సీ బరిలోకి దింపుతున్న విషయం తెలిసిందే. అయితే మొత్తం ఓట్లలో టిఆర్‌ఎస్‌కు సుమారు 317ఓట్లే ఉండగా, మిగిలిన అన్నింటిని తమ ఖాతాలో వేసుకునేందుకు వామపక్షపార్టీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వామపక్ష పార్టీలైన సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి ఓటర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పువ్వాడకు మద్దతునిచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. మరో వైపు తెలుగుదేశం కూడా టిఆర్‌ఎస్‌ను ఓడించటమే లక్ష్యంగా పువ్వాడకు మద్దతిచ్చే అంశంపై ఆలోచిస్తోంది. సుమారు 90ఓట్లు కలిగిన వైఎస్‌ఆర్‌సిపి మాత్రం తొలుత పువ్వాడ మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అన్పించినా తాజాగా అభ్యర్థినే బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టిఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. అన్ని పార్టీలు పువ్వాడకు మద్దతునిచ్చినా టిఆర్‌ఎస్, వైసిపిలు పోటీలో ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితే కన్పిస్తోంది. మొత్తం 693ఓట్లలో 90 ఓట్లు కలిగిన వైసిపి పోటీలో ఉంటే మిగిలిన 603ఓట్లే ఇరుపార్టీలు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే టిఆర్‌ఎస్‌కు సుమారు 317ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి గెలవటం సులభం అవుతుంది. ఈ అంశంపై వామపక్షనేతలు సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. పోటీలో ఇద్దరే ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసిపి అభ్యర్థి పోటీలో ఉంటారని ప్రచారం జరగటంతో వామపక్ష నేతలు కొంత నిరుత్సాహానికి కూడా గురయ్యారు. అయితే ఆ పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి అన్ని పార్టీలను పువ్వాడకు మద్దతిచ్చేలా చూసే ప్రయత్నం చేస్తున్నా అది ఇంకా కొలిక్కి రాలేదు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావటం, ఈ నెల 9వ తేదీ వరకే గడువు ఉన్న నేపథ్యంలో 5వ తేదీలోగా అభ్యర్థుల ప్రకటన పూర్తయ్యే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
* షెడ్యూల్ ప్రకటించిన రిటర్నింగ్ అధికారి బాబూరావు
* నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 2: ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికకు రిటర్నింగ్ అధికారి, జిల్లా సంయుక్త కలెక్టర్ బాబూరావు నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలో ఉన్న ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జెసి షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జడ్పిటిసి, ఎంపిటిసి, కౌన్సిలర్, వార్డు మెంబర్లకు ఓటు హక్కు ఉంటుందని, మొత్తం 693 ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. బుధవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు పోటీ చేయనున్న అభ్యర్థుల నుంచి నామినేషన్‌లు స్వీకరించడం జరుగుతుందని, 10వ తేదీన నామినేషన్ల పరిశీలన, 12వ తేదీన ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించారు. 27వ తేదీన పోలింగ్ జరుగుతుందని, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. 30వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. జనవరి 1వ తేదీ వరకు ఎన్నికల సంఘం నిబంధనలు కొనసాగుతాయని, అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు నిబంధనలను ఉల్లంఘించరాదన్నారు. ఎవరైన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉండాలని, వారిని స్థానిక సంస్థల ఓటర్లు పది మంది బలపరచాలని సూచించారు. ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం(జెసి చాంబర్)లో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. జడ్పిటిసిలకు జెడ్పి సిఇవో, ఎంపిటిసిలకు ఎంపిడివోలు ఫోటోతో కూడిన గుర్తింపు కార్డులను జారీ చేస్తారని, ఆ కార్డులు ఉంటేనే ఓటింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లలో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఖమ్మం, కొత్తగూడెం డివిజన్‌లలో మరో రెండు బూత్‌లు అవసరం ఉంటుందని ఎన్నికల కమీషన్‌కు లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థులు సెక్యూరిటి డిపాజిట్ కింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5వేలు, ఇతర అభ్యర్థులు 10వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుందన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఫారం ఏ, బిలను 9వ తేదీ లోపు అందించాలన్నారు. ఎవరైన ఎన్నికల కమీషన్ విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి మండలంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఉంటుందని, వారు అన్ని వాహనాలను తనిఖీ చేస్తారన్నారు.

మావోల కవ్వింపు చర్యలు
భద్రాచలం, డిసెంబర్ 2: పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు పోలీసులే లక్ష్యంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకించి భద్రాచలం పట్టణాన్ని వేదికగా చేసుకుని పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర విభజనలో భద్రాచలం పట్టణం చుట్టూ ఉన్న భూభాగమంతా ఆంధ్రాలో విలీనమైన సంగతి విదితమే. దీంతో భద్రాచలం పట్టణ సరిహద్దుకు వచ్చి మావోయిస్టు జిల్లా కమిటీ, శబరి కమిటీలు కరపత్రాలను, బ్యానర్లను విడుదల చేస్తున్నారు. దీంతో పోలీసులు అసహనానికి గురవుతున్నారు. గతంలో భద్రాచలం సమీపానికి రావాలంటేనే జంకే మావోలు నేరుగా పట్టణానికే వచ్చి తమ కార్యకలాపాలను నిర్వహించే ప్రయత్నం చేయడం గమనార్హం. పిఎల్‌జిఏ వారోత్సవాలతో అప్రమత్తంగా ఉన్న పోలీసులు కేవలం తమ స్టేషన్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో తమను కవ్వించి ముగ్గులోకి దించేందుకు మావోయిస్టులు ఈ తరహా ఎత్తుగడలు వేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు తమ బలగాలను మరింత అప్రమత్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి కూనవరం వెళ్లే మార్గంలో పట్టణ శివారున శిశుమందిర్ సమీపంలో మావోయిస్టులు కరపత్రాలు వదిలారు. మరోవైపు చర్ల రహదారిలో గత రెండురోజులుగా వరుసగా కరపత్రాలను వదులుతున్నారు.

టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బాలసాని ...?
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 2: స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పేరు ఖరారైనట్లు సమాచారం. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం గతంలో టిడిపి ఎమ్మెల్సీగా ఉన్న బాలసాని తుమ్మలతో సహా టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ సమయంలో టిఆర్‌ఎస్ అధిష్ఠానం ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల కోటాలో ఆయనకు టిక్కెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో డిసిసిబి చైర్మన్‌గా, శాసనమండలి సభ్యునిగా పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం తుమ్మలకు ప్రధాన అనుచరుడిగా కూడా ఆయన కొనసాగుతున్నారు. మారుమూల అటవీ ప్రాంతమైన వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన ఆయన ఖమ్మంలో స్థిరపడ్డారు. ఇదిలా ఉండగా బాలసాని అభ్యర్థిత్వాన్ని టిఆర్‌ఎస్‌లోనే కొందరు వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేయటమే కాకుండా ఉద్యమంలో పని చేసిన వారికి ప్రాధాన్యమివ్వాలని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వొద్దని ఉద్యమకారులు కోరుతున్నారు. దీనిపై పార్టీ నేతలు కొందరు అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేశారు. అలాగే అటు టిడిపిలోనూ, ఇటు టిఆర్‌ఎస్‌లోనూ ఆయనకే పదవులు కట్టబెట్టడం వల్ల తుమ్మలతో పాటు టిఆర్‌ఎస్‌లో చేరిన వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తుమ్మల మాత్రం అందరిని సర్ధుబాటు చేస్తూ బాలసాని పేరును సూచించినట్లు సమాచారం.

ఎన్నికల దృష్టితో అలవిగాని వాగ్దానాలు చేయడం తగదు
* కలెక్టరేట్ ముట్టడిలో సిపిఎం నేత పోతినేని
ఖమ్మం (కల్చరల్), డిసెంబర్ 2: కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అమలుకాని వాగ్దానాలు చేయడం సరైంది కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శనరావు అన్నారు. బుధవారం నగరంలో 15 వేల మంది నివాసం లేని పేదల సమస్యలపై చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు కలెక్టరేట్‌లోకి వెళ్ళే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గానికి 400 డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ళను మంజూరి చేసినట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నగరవాసులను దృష్టిలో ఉంచుకొని మరో 1600 ఇళ్ళు అదనంగా మంజూరు చేయించినట్లు చెప్పుకోవడం హర్షించదగ్గ విషయమేనన్నారు. నగర ప్రజలపై అంత మమకారం ఉంటే వెంటనే అర్హులను ఎంపిక చేసి జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసం తప్పుడు ప్రకటనలు చేసి అమాయక ప్రజలతో ఆడుకోవద్దని హితవు పలికారు. నగరంలో ఇళ్ళ సమస్యలపై సిపిఎం గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తుందన్నారు. అనేక ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేసి అనేక సార్లు జైళ్ళకు సైతం వెళ్ళామన్నారు. 2006లో సిపిఎం పోరాట ఫలితంగా ఆనాటి ప్రభుత్వం సర్వే చేయించి 6వేల మందిని అర్హులుగా గుర్తించిందన్నారు. అందులో 4 వేల మందికి పట్టాలు ఇచ్చి, నేటికి స్థలం చూపించటంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానమైన డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ళ సంగతేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అర్హులైన పేదలందరికి ఇళ్ళు, ఇళ్ళ పట్టాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఇది భారీఉద్యమం కాకముందే సమస్యను పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అనంతరం జరిగిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కొంత ఉధృతికి దారితీసింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పోతినేనితో పాటు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, మచ్చా వెంకటేశ్వరరావు, వై విక్రమ్,బుగ్గవీటి సరళ, అప్రోజ్ సమీనా, గట్టు రమాదేవి, ఎర్రా శ్రీకాంత్, ఎర్రా శ్రీనివాసరావు, నర్రా రమేష్ తదితరులను అరెస్టు చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో కోదాటి గిరి, విష్ణువర్దన్, జబ్బార్, ఎస్‌కె మీరా, బండారు యాకయ్య, ఎస్‌కె బాబు, వాసిరెడ్డి మల్లికార్జునరావు, మర్రి బాబురావు, జిల్లా ఉపేందర్, బుర్రి వెంకట్‌కుమార్, బేగం, వందలాది మంది లబ్దిదారులు పాల్గొన్నారు.

వైభవంగా అయ్యప్పస్వామి ఆరట్టు ఉత్సవం

మధిర, డిసెంబర్ 2: స్థానిక లడక్‌బజార్‌లోని అయ్యప్పనగర్‌లో వేంచేసి ఉన్న అయ్యప్పస్వామి వారికి బుధవారం స్థానిక వైరా నదిలో భక్తుల కోలాహాలం మధ్య ఆరట్టు (నదీస్నానం) వైభవంగా నిర్వహించారు. గత నెల 25వ తేదీ నుంచి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు స్వామివారి నదీస్నానంతో ముగిశాయి. స్వామివారితో పాటు అయ్యప్పమాలధారులు, భక్తులు వైరానదీలో పుణ్యస్నానాలు ఆచరించారు. మంగళవారం రాత్రి జరిగిన భారీ పల్లివేట కార్యక్రమం అనంతరం స్వామి వారి ఆలయ మంటపం ఆవరణంలో ఉత్సవ విగ్రహాన్ని అయ్యప్పదీక్షాపరులు, భక్తులు, మహిళలు ప్రత్యేకంగా పూలతో అలంకరించిన పల్లకిలో వైరా నది వద్దకు తీసుకెళ్ళారు. స్వామివారికి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలకు పసుపు, కుంకుమలను అందచేశారు. వారం రోజులుగా అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఆరట్టు ఉత్సవంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయం వద్ద సుమారు 10వేల మందికిపైగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజ కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు విశాఖ నంబూద్రీ, వినోద్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహాకులు చలువాది ధర్మారావు, చలువాది శ్రీనివాసరావు, దేవిశెట్టి రంగారావు, బత్తుల శ్రీనివాసరావు స్వామి, చెరుపల్లి శ్రీ్ధర్‌స్వామి, ఏలూరి రామారావు స్వామి, వంకాయలపాటి వెంకటనాగేశ్వరరావు స్వామి, వల్లాపురి వెంకటేశ్వరరావు స్వామి, వినయ్‌కుమార్ స్వామి, సాంబశివరావు స్వామి, వంకాయలపాటి నాగేశ్వరరావు, బోజడ్ల నాగేశ్వరరావు, శ్రీను స్వామి, శివమాలధారులు, భవాని మాలధారులు పాల్గొన్నారు.

జేసీగా బాబూరావు
బాధ్యతల స్వీకారం
ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 2: జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఏజెసి బాబురావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జెసి దివ్య సెలవులపై వెళ్ళడంతో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం, ప్రభుత్వం ఏజెసి బాబూరావుకు జెసిగా బాధ్యతలను అప్పగించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా జెసి వ్యవహరించాల్సి ఉండడంతో ఆ బాధ్యతలను పూర్తి స్థాయిలో బాబురావుకు అప్పగించారు. జెసిగా బాధ్యతలు తీసుకున్న బాబురావుకు కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.

కొత్త జిఓతో తగ్గిన వాహన రిజిస్ట్రేషన్లు
ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 2: పైనాన్స్‌పై కొనుగోలు చేసిన నూతన వాహనాలకు 0.5శాతం స్టాంప్ డ్యూటీ చెల్లించాలని జీవో అమలు చేయటంతో బుధవారం ఆర్‌టిఓ కార్యాలయంలో నూతన వాహనాల రిజిస్ట్రేషన్‌లు లేక వెలవెలబోయింది. ఆర్‌టిఏ కార్యాలయంలో రోజుకు కనీసం 60నుండి 70వాహనాల వరకు రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉండగా మంగళవారం నుండి వాహనాల రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. కొంత మంది వాహనదారులు పెద్ద కంపెనీల నుండి పైనాన్స్ తీసుకున్న వాహనాలకు స్టాంప్ డ్యూటీలు చెల్లించినప్పటికి వాటిలో అనేక లోపాలు ఉన్నాయంటూ అధికారులు వెల్లడిస్తుండటంతో వాహనదారులు వెనుతిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వాహనదారులు వాపోతున్నారు. చిన్న పైనాన్స్ కంపెనీల నుండి వాహనాన్ని కొనుగోలు చేసిన వాహనదారులు ఎటు అర్దంకాక సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి జివోను వాహనదారులపై పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.

మంత్రి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరికలు
ఖానాపురం హవేలి, డిసెంబర్ 2: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, వివిధ పార్టీల నాయకులు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో బూర్గంపాడు మండలం ఇరవెండి ఎంపిటిసి వల్లూరుపల్లి వంశీకృష్ణ, పినపాక పంచాయతీ పట్టినగర్ ఎంపిటిసి-6 తోటమళ్ళ సరిత, సారపాక-6 ఎంపిటిసి సగవాత్ మీనా, బూర్గంపాడు మండలాధ్యక్షుడు తోటమళ్ళ భిక్షంతో ఆయా మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులకు మంత్రి తుమ్మల టిఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. అభివృద్ధి కోసం పాటుపడేవారంతా టిఆర్‌ఎస్‌లో చేరాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, లక్ష్మినారాయణ, బేగ్, కోటేశ్వరరావు, నాగచంద్రారెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమానికి ఊతం ఇస్తున్న చేరికలు
చండ్రుగొండ, డిసెంబర్ 2: ప్రజాసమస్యలపై ఉద్యమిస్తున్న సిపిఎం పార్టీకి పలు పార్టీలకు చెందిన క్రియశీలక కార్యకర్తలు సిపిఎం పార్టీలో చేరుతుండడంతో ప్రజాసమస్యలపై ఉద్యమించేందుకు సిపిఎం పార్టీకి మరింత శక్తిని ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య తెలిపారు. బుధవారం మండలంలోని కంపగూడెం గ్రామానికి చెందిన 38కుటుంబాలు కాసాని ఐలయ్య సమక్షంలో సిపిఎం పార్టీలోకి చేరారు. వీరిని కాసాని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ గ్రామాల్లోని పలు పార్టీలకు చెందిన నాయకులతో పాటు జిల్లాస్థాయి నాయకులు సైతం సిపిఎం పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. వీరి చేరికల వలన పార్టీ బలోపేతం కావడంతో పాటు ప్రజాసమస్యలపై జరిగే ఉద్యమాలు బలంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎజె రమేష్‌తో పాటు జిల్లా, డివిజన్ నాయకులు అన్నవరపు సత్యనారాయణ, జాటోత్ కృష్ణ, వంకాయలపాటి శ్రీనివాసరావు, చిరంజీవినాయుడు, సీతారాములు, కాక మహేష్, వెంకటేశ్వర్లు, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

ఆసరా ఘనత కెసిఆర్‌దే
* టిఆర్‌ఎస్ నేతల ఉద్ఘాటన
ఖానాపురం హవేలి, డిసెంబర్ 2: అర్హులందరికి ఆసరా పెన్షన్ అందించి వృద్ధులను, వితంతువులను, వికలాంగులను ఆదుకున్న ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని టిఆర్‌ఎస్ నాయకులు కృష్ణ, కమర్తపు మురళీలు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని 2వ డివిజన్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలుతీరుపై స్థానికులతో చర్చించారు. అదే విధంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై ప్రజల నుంచి వచ్చిన స్పందన అద్భుతమని, ప్రజలు త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పట్టం కట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నారనా