వరంగల్

పోలీసు శాఖలో వేగంగా విభజన ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 29: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పాటయ్యే పోలీసుస్టేషన్ వౌళిక సదుపాయాల రూపకల్పన ఏర్పాట్లను ప్రత్యక్ష్యంగా పర్యవేక్షించాలని రాష్ట్ర అదనపు డిజిపి గోపికృష్ణ వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబును, ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝాలను ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా నూతనంగా ఏర్పాటయ్యే జిల్లాలలో తాత్కాలిక పోలీసు కార్యాలయాల ఏర్పాట్లపై రాష్ట్ర అదనపు డిజిపి పోలీసు అధికారులతో గురువారం వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నూతనంగా ఏర్పాటవుతున్న జిల్లాలో పోలీసు కార్యాలయం నిర్వాహణ కోసం తాత్కాలిక భవనాలను గుర్తింపుతో పాటు కార్యాలయ నిర్వాహణ కొరకు కావాల్సిన వౌలిక సదుపాయాల కల్పన తీరుపై అదనపు డిజిపి పోలీసు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అదనపు డిజిపి సంబంధిత పోలీసు అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర అదనపు డిజిపితో వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ పోలీసుస్టేషన్ల పరిధిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఐనవోలు, వేలేర్, చిల్పూరు, ఇల్లంతకుంట(కరీంనగర్ జిల్లా) పోలీసుస్టేషన్ల కొరకు కావాల్సిన భవనాలను గుర్తించడం జరిగిందన్నారు. ముఖ్యంగా పోలీసు నిధులు, భద్రతా పరంగా అనుకూలంగా ఉన్న భవనాలను మాత్రమే గుర్తించామన్నారు. దసరా నాటికి నూతన పోలీసుస్టేషన్లను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం పోలీసుకమిషనరేట్ పరిధిలో ఉన్న సిబ్బందిని సంబంధిత నూతన పోలీసుస్టేషన్లకు కేటాయించి కొత్త పోలీసుస్టేషన్లు ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. రాబోవు రోజుల్లో పోలీసుస్టేషన్లకు కావాల్సిన నిర్దేశిత సిబ్బందిని నియమించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ రేంజ్ డి ఐజి రవివర్మ, రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, సిటి స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రవీందర్‌రావు, సిటి పోలీసు కార్యాలయ ఎవో స్వరూపరాణిలు పాల్గొన్నారు.