వరంగల్

ముత్తిరెడ్డి వర్సెస్ బూర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేర్యాల, సెప్టెంబర్ 29: మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి గురువారం శంకుస్థాపనలు చేసిన అనంతరం పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గమైన జనగామ ప్రాంత అభివృద్ధికి భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్ కృషి చేయాలని, అందుకు నిధులు కేటాయించాలని కోరుతూ అభివృద్ధి పనులకు సంబంధించిన చిట్టాను ఎంపికి సమర్పించారు. దీంతో ఎంపి బూర నర్సయ్య ఒకింత ఆగ్రహానికి గురై జనగామ ఒక ఎమ్మెల్యే నియోజకవర్గమే కాదని, తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి సైతం వస్తుందని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యేకు సూచిస్తూ అన్నారు. తనకు యేటా రూ.5కోట్ల నిధులు మాత్రమే ఉంటాయని, తన నియోజకవర్గ పరిధిలో రూ. ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయని, ఆ నిధులు ఏ మేరకు సరిపోతాయని ఆయన అన్నారు. అయితే, జనగామ కోసం ఇలాంటి బహిరంగ సమావేశంలో నిధులు అడగటం ఎమ్మెల్యేది సరైన పద్ధతి కాదని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజల కోసం తాను కృషి చేస్తున్నానని, అందులో భాగంగానే ఎంపిని నిధులు కేటాయించాలని అడిగినట్లు తెలిపారు. తన సొంత డబ్బులతో అభివృద్ధి చేయడం లేదని, అది ప్రభుత్వం కేటాయించిన నిధుల నుండే అభివృద్ధి చేస్తున్నానని ఆగ్రహంతో తెలిపారు. వీరిరువురి ఆగ్రహాలను గుర్తించి డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ ఇరువురు అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారని, కాని వారి మార్గాలు వేరని సర్దిచెప్పడం విశేషం.