వరంగల్

ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాముత్తారం, నవంబర్ 14: ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కార్యకర్తలకు మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు పిలుపునిచ్చారు. సోమవారం మహాముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డబుల్ బెడ్ రూం, దళితులకు మూడెకరాల భూమి, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ కల్పించడంలో విఫలమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. నూతనంగా ఎన్నికైన ఎంపిపి మెండే వెంకటస్వామికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపిపి ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీల ఎంపిటిసిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారికి ఎలాంటి హానీ తలపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంపీ, శాసన సభ సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వారందరికి తమ సహాయ సహాకారాలుంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన తండ్రి శ్రీపాద రావు, తాను ఎంతో కృషి చేశానని అన్నారు. కానీ ఇక్కడ అభివృద్ధే జరుగలేదని టి ఆర్ ఎస్ నాయకులు అనడం సిగ్గు చేటని ఆయన పేర్కొన్నారు. గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ హాయాంలో అటవీ హక్కు చట్టం ప్రకారం హక్కు కల్పిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటుతుందని, అటవీ శాఖ అధికారుల ద్వారా భూములు గుంజుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
గాజారాంపల్లి గ్రామస్థులు గుడిసెలు వేసుకుంటే అటవీ శాఖ అధికారులు దాడులు చేసి గుడిసెలు తొలగిస్తున్నారని, ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని అన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. నాణ్యత లేకుండా పనులు చేపట్టి అక్రమాలక పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సమావేశంలో సింగల్ విండో చైర్మన్ లక్కిరెడ్డి నర్సింహరెడ్డి, ఎంపిపి మెండే వెంకటస్వామి, సర్పంచ్‌లు లక్ష్మయ్య, కిష్టయ్య, ఎంపిటిసి రాజబాపు, వనిత సడవలి, గోమాస శ్రీనివాస్, జడ్పిటిసి జిల్లా ఫ్లోర్ లీడర్ చల్లా నారాయణ రెడ్డి, చొప్పరి సదానందం, సమ్మయ్య, రాంనారాయణ గౌడ్, నజీర్ ఖాన్, తాటి లచ్చయ్య, మహేష్ తదితరులున్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు పార్టీలోకి ఆహ్వానించారు.