వరంగల్

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 10: నగరం లో మహిళల పట్ట అసభ్యంగా ప్రవర్తించే ఈవ్‌టీజర్లపై కఠినచర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ డిసిపి వేణుగోపాల్‌రావు హెచ్చరించారు. నగరంలోని కెఎల్‌ఎన్ రెడ్డి కాలనీ, నయింనగర్ తదితర ప్రాం తాలలో కళాశాలలకు వెళ్లే విద్యార్థినులను, మహిళలను కొంతమంది ఆకతాయిలు వేధిస్తున్నట్లు సమాచారం అందటంతో కమీషనర్ ఆదేశాల మేరకు షీ-టీం ఏసిపి ఈశ్వర్‌రావు, ఎస్సై రాజేంద్రప్రసాద్ షీ-టీం సభ్యుల సహాయంతో 14మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఈవ్‌టీజర్లను వారి తల్లిదండ్రుల సమక్షంలో సెంట్రల్ జోన్ డిసిపి వేణుగోపాలరావు కౌన్సిలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో విద్యార్థినులను, మహిళలను వేధించే కార్యక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు పడేలా చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులు నమోదయిన యువకులకు భవిష్యత్తు ఉండదని స్పష్టం చేసారు. తమ పిల్లల నడవడికపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసిపి ఈశ్వర్‌రావు, ఎస్సై రాజేంద్రప్రసాద్, షీ-టీ సభ్యులు పాల్గొన్నారు.

ఫత్తేషాపురంలో దుర్గామాత ఉత్సవాలు ప్రారంభం
రఘునాథపల్లి, డిసెంబర్ 10: మండలంలోని ఫత్తేషాపురంలో దుర్గామాత వేడుకలు శనివారం ఘనం గా ప్రారంభమయ్యాయి. ఉదయానే్న గ్రామస్థులు కుటుంబ సమేతంగా నూతన వస్త్రాలు ధరించి దుర్గామాత ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకొని డప్పు వాయిద్యాలు, నృత్యాల నడుమ బోనాలను తీసుకొని ఆలయ సన్నిధికి చేరుకొని అమ్మవారికి నైవేధ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ పిల్లా పాపలతో పాడిపంటలు సమృద్ధిగా పండి సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. నేడు(ఆదివా రం) వనభోజన కార్యక్రమం ఉంటుందని గ్రామ సర్పంచ్ అక్కనపెల్లి సత్యనారాయణ తెలిపారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా గ్రామ పంచాయతీ ఆధ్వర్యం లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. బంధువుల రాకతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మాలోతు నర్సింహ, గ్రామస్థులు గొట్టం భాస్కర్‌రెడ్డి, మహేందర్‌జీ, ఉపేందర్‌రెడ్డి, స్ఫూర్తిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు.