అంతర్జాతీయం

నిజాయితీ.. ముక్కుసూటితనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ప్రధాని మోదీ నైజం
ఇది ఒబామా మనసులోని మాట
వెల్లడించిన అమెరికా అధ్యక్ష భవనం

వాషింగ్టన్, డిసెంబర్ 3: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిజాయితీపరుడని, ముక్కుసూటిగా మాట్లాడే రాజకీయ నాయకుడని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భావిస్తున్నారు. భారతదేశానికి సంబంధించి స్పష్టమైన అవగాహన మోదీకి ఉందని ఒబామా భావిస్తున్నారని అమెరికా అధ్యక్ష భవనం శే్వతసౌధం తెలిపింది. ‘మోదీ నిజాయితీపరుడని, తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వ్యక్తపరిచే రాజకీయ నాయకుడని, ఆయనకు వాస్తవ పరిస్థితులపై మంచి అవగాహన ఉందని, తన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, మాతో సంబంధాల గురించి స్పష్టమైన అవగాహన ఉందని అధ్యక్షుడు ఒబామా భావిస్తున్నారు’ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరి జోష్ ఎర్నెస్ట్ బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) వాతావరణ మార్పుల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పారిస్ వచ్చిన మోదీతో ఒబామా సోమవారం భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతలు భేటీ కావడం ఇది ఆరోసారి. వీరిద్దరు గత సంవత్సరం సెప్టెంబర్‌లో వైట్ హౌస్‌లో మొదటిసారి భేటీ అయ్యారు. ‘్భరతదేశాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్లాలని తాను కోరుకుంటున్నారో మోదీకి స్పష్టంగా తెలుసు, దీనివల్ల సమర్థవంతమైన రాజకీయ నాయకుడిగానే కాక సమర్థవంతమైన ప్రధానమంత్రి కాగలిగారు’ అని ఎర్నెస్ట్ అన్నారు. ‘ఒబామా ప్రధాని మోదీని గౌరవిస్తారు. రాజకీయ నాయకుడిగా మోదీ నైపుణ్యాలను, సామర్థ్యాలను ఆయన అభినందిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్నతస్థాయి పదవిలో కూర్చోవడం వల్ల మోదీ చాలా జటిలమైన సవాలును స్వీకరించారు’ అని ఎర్నెస్ట్ పేర్కొన్నారు. ఈ ఇద్దరు నేతలు తరచుగా భేటీ అవుతుండటాన్ని ప్రస్తావిస్తూ, అనేక సందర్భాలలో మోదీని సంప్రదించే అవకాశం ఒబామాకు వచ్చిందని ఆయన అన్నారు. ‘ఈ ఇద్దరు నేతలకు ఉన్న కలిసి పనిచేసే మంచి లక్షణానికేకాక మా ఇరు దేశాల మధ్య గల ఉమ్మడి అంశాలకు, ఆ అంశాలపై కలిసి పనిచేసేందుకు ఈ ఇద్దరు నేతలకు ఉన్న సామర్థ్యానికి, మా రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలను నెరవేర్చే దిశగా ముందుకు సాగడానికి ఇది నిదర్శనం. ఇది మంచి విషయం’ అని ఎర్నెస్ట్ వ్యాఖ్యానించారు. ఇది ప్రపంచానికి, ఇరు దేశాల పౌరులకు మంచి విషయమని ఆయన పేర్కొన్నారు.