బిజినెస్

విల్‌ఫుల్ డిఫాల్టర్లపై సెబీ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్ల నుంచి నిధుల సమీకరణపై నిషేధం
మదుపరుల ప్రయోజనాల కోసం ప్రభావవంతమైన చర్యలు

న్యూఢిల్లీ, మార్చి 12: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విల్‌ఫుల్ డిఫాల్టర్లపై కొరడా ఝుళిపించింది. బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాటిని తిరిగి ఉద్దేశపూర్వకంగానే చెల్లించని ఘనులతో మదుపరుల ప్రయోజనాలకు భంగం తప్పదని భావించిన సెబీ.. స్టాక్స్, బాండ్ల ద్వారా ప్రజల నుంచి నిధులను సమీకరించకుండా వారిపై నిషేధించింది. అంతేగాక స్టాక్ మార్కెట్లలో లిస్టయిన సంస్థల బోర్డుల్లో కూడా విల్‌ఫుల్ డిఫాల్టర్లు ఉండరాదని స్పష్టం చేసింది.
ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి 9,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న విజయ్ మాల్యాకు తాజా సెబీ నిర్ణయం ఇబ్బందికరం కానుంది. మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 17 ప్రభుత్వరంగ బ్యాంకుల వద్ద వేలాది కోట్ల రూపాయల అప్పులు తీసుకుని, వాటిని చెల్లించడంలో విఫలం కావడంతో ఎస్‌బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్‌లు మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించినది తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టుల చుట్టూ తిరుగుతుండగా, శనివారం జరిగిన సెబీ కీలక సమావేశం విల్‌ఫుల్ డిఫాల్టర్ల భరతం పట్టేలా పలు నిర్ణయాలు తీసుకుంది. ఇదిలావుంటే ఈ సందర్భంగా సెబీ చైర్మన్ యుకె సిన్హా విలేఖరులతో మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా విల్‌ఫుల్ డిఫాల్టర్ల ముద్ర వేసుకున్నవారికి మార్కెట్ ప్రవేశానికి అర్హత లేదన్నారు. స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించిన సంస్థలు తమ ఆర్థిక వివరాలన్నింటినీ క్షుణ్ణంగా, సమయానుసారం తెలపాలనీ సిన్హా స్పష్టం చేశారు. అంతేగాక సామాన్య మదుపరుల రక్షణార్థం నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు. సస్పెండెడ్ కంపెనీల డీలిస్టింగ్‌కు మార్గం సుగమం చేస్తున్నామన్న ఆయన విలీనాలు, కొనుగోళ్ల అంశంలో మరింత స్పష్టతను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులకు (ఎఫ్‌పిఐ) మ్యూచువల్ ఫండ్స్‌ను మరింత దగ్గర చేర్చే ప్రయత్నాలనూ సెబీ చేసింది. మరోవైపు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లోకి ప్రత్యక్షంగా దిగాలనుకుంటున్న బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సెబీ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) వెళ్లవచ్చని చెప్పినట్లు సిన్హా తెలిపారు. ఇక కొత్త కమాడిటీ ఉత్పత్తులను పరిచయం చేయనున్నామని, కమాడిటీ డెరివేటివ్ మార్కెట్‌లో మరికొందరిని భాగస్వాములను చేయాలని భావిస్తున్నామని చెప్పారు. మరోవైపు మార్కెట్ వ్యవహారాలపై జాగ్రత్తగా ఉండాలని జైట్లీ సెబీకి సూచించారు.