క్రీడాభూమి

ఫ్రాంక్ వొరెల్ ట్రోఫీ ఆసీస్‌కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా రెండో టెస్టులోనూ విండీస్ చిత్తు

మెల్బోర్న్, డిసెంబర్ 29: ఫ్రాంక్ వొరెల్ ట్రోఫీ కోసం వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా మరోసారి విజేతగా నిలిచింది. ఈ సిరీస్‌లో ఇంతకుముందు జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 212 పరుగుల తేడాతో కరీబియన్లను మట్టికరిపించిన కంగారూలు మంగళవారం మెల్బోర్న్‌లో నాలుగు రోజులకే ముగిసిన ముగిసిన రెండో టెస్టులో 177 పరుగుల తేడాతో వరుసగా రెండో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ట్రోఫీని నిలబెట్టుకుంది. నాథన్ లియోన్, మిఛెల్ మార్ష్ బౌలింగ్‌లో చక్కగా రాణించి ఆస్ట్రేలియా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగుల ఆధిక్యత సాధించిన ఆస్ట్రేలియా సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 179 పరుగులు సాధించిన విషయం విదితమే. దీంతో మొత్తం మీద 459 పరుగుల ఆధిక్యతలో నిలిచిన ఆస్ట్రేలియా మంగళవారం నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందే ఓవర్‌నైట్ స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో 460 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు కంగారూల బౌలింగ్‌ను ప్రతిఘటించడంలో మరోసారి విఫలమైంది. ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (31), రాజేంద్ర చంద్రికా (37), సీనియర్ బ్యాట్స్‌మన్లు డారెన్ బ్రావో (21), సెకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్ మర్లాన్ శామ్యూల్స్ (19)లతో పాటు బ్లాక్‌వుడ్ (20) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించడంతో వెస్టిండీస్ జట్టు 150 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ తరుణంలో వికెట్ కీపర్ దినేష్ రామ్‌దిన్, కెప్టెన్ జాసన్ హోల్డర్ స్థిమితంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఆరో వికెట్‌కు అయితే 100 పరుగులు జోడించిన తర్వాత రామ్‌దిన్ (59) మిఛెల్ మార్ష్ బౌలింగ్‌లో వికెట్ల వెనుక నెవిల్‌కు దొరికిపోగా, అతని స్థానంలో వచ్చిన కార్లోస్ బ్రాత్‌వైట్ (2), హోల్డర్ (68) కొద్ది పరుగుల వ్యవధిలో నిష్క్రమించారు. ఆ తర్వాత కెమర్ రోచ్ (11), జెరోమ్ టేలర్ (0) వెంటవెంటనే పెవిలియన్‌కు పరుగు తీయగా, జొమెల్ వర్రికన్ (4) అజేయంగా నిలిచాడు. దీంతో 88.3 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌటైన వెస్టిండీస్ జట్టు 177 పరుగుల తేడాతో వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిఛెల్ మార్ష్ 4 వికెట్లు, నాథన్ లియోన్ 3 వికెట్లు, జేమ్స్ పాటిన్సన్ 2 వికెట్లు, పీటర్ సిడిల్ ఒక వికెట్ చొప్పున సాధించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 271 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. (చిత్రం) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ నాథన్ లియోన్