క్రీడాభూమి

ఆఫ్గాన్ సంచలన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్:టి-20 ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. పసికూన ఆఫ్గానిస్తాన్ జట్టు వరుస విజయాలతో గట్టి జట్టుగా పేరొందిన వెస్టిండీస్‌పై అద్భుత విజయం సాధించింది. ఈ టోర్నీలో గ్రూప్ 1లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఘన విజయాలు సాధించిన వెస్టిండీస్ ఇవాళ నాగపూర్‌లో ఆఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోవడం సంచలనం కలిగించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 117 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆఫ్గానిస్తాన్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించినట్లయింది. అయితే ఈ ఓటమితో వెస్టిండీస్‌గు నష్టమేమీ లేదు. ఈ టోర్నీలో సెమీస్‌కు ఇప్పటికే అర్హత సాధించింది.