క్రీడాభూమి

ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ విజేత ఒకుహరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, మార్చి 14: బాడ్మింటన్‌లో ‘వింబుల్డన్’గా పేర్కొనే ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో నొజోమీ ఒకుహరా విజేతగా నిలిచింది. మహిళల ఫైనల్‌లో హాట్ ఫేవరిట్ వాంగ్ షిజియాన్ (చైనా)పై జపాన్‌కు చెందిన ఒకుహరా 21-11, 16-21, 21-19 ఆధిక్యంతో విజయం సాధించి, కెరీర్‌లో తొలిసారి ఆల్ ఇంగ్లాండ్ టైటిల్‌ను అందుకుంది. కాగా పురుషుల ఫైనల్‌లో చైనాకు చెందిన లిన్ డాన్ తన సహచర ఆటగాడు తియాన్ హొవెయ్‌ని 21-9, 21-10 తేడాతో వరుస సెట్లలో ఓడించి, ఆరోసారి ఆల్ ఇంగ్లాండ్ టైటిల్‌ను కైవసుం చేసుకున్నాడు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతుందనుకున్న ఫైనల్ పోరు ఏకపక్షంగా ముగియడం అభిమానులను నిరాశ పరచింది.