తెలంగాణ

వేధింపులు తాళ లేక గృహిణి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : అదనపు కట్నం తీసుకురావాలని లేకుంటే వ్యభిచారం చేసి సంపాదించాలని భర్తతోపాటు అత్తమామల వేధింపులు తాళ లేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని ఎల్లారెడ్డిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన బుధవారం వెలుగుచూసింది. ఆడపిల్ల పుట్టిందనే కారణంగా పుట్టింటికి వెళ్లి అదనపు కట్నం తీసుకురావాలని భర్తతోపాటు అత్తమామల నుంచి వేధింపులు మొదలైయ్యాయి. అందుకు ససేమీరా అనడంతో వ్యభిచారం చేసి సొమ్ము సంపాదించి పెట్టాలని వారు గృహణిని వేధించారు. మానసికంగా కుంగిపోయిన ఆమె బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. భర్తతోపాటు అత్తమామలను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.