బిజినెస్

భారత జిడిపి అంచనాను సవరించనున్న ప్రపంచ బ్యాంక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 26: భారత జిడిపి వృద్ధిరేటు అంచనాను ప్రపంచ బ్యాంక్ సవరించే అవకాశాలున్నాయని బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ బసు అన్నారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింప జేసుకోవడంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైన క్రమంలో ఆ ప్రభావం దేశ జిడిపి వృద్ధి అంచనాపై చూపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జనవరి సమీక్షలో భారత వృద్ధిరేటు అంచనాలో కొన్ని మార్పులుండవచ్చునని పేర్కొన్నారు. నిర్ణయాత్మక సంస్కరణల అమలు విషయంలో అజాగ్రత్త దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చివేయగలదన్న ఆందోళనను ఈ సందర్భంగా ఆయన వెలిబుచ్చారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) భారత జిడిపి వృద్ధిరేటు అంచనాను 7.5 శాతంగా వేసింది ప్రపంచ బ్యాంక్. 2016-17 ఇది 7.8 శాతంగా, 2017-18లో ఇది 7.9 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.