బిజినెస్

ప్రపంచ ఆర్థిక ప్రగతిపై సన్నగిల్లిన విశ్వాసం

  • 26/01/2012

దావోస్, జనవరి 25: ప్రపంచ ఆర్థిక పురోగతిపై అవిశ్వాసం సర్వత్రా పెరిగిన నేపధ్యంలో విశ్వ ఆర్థికప్రగతి ప్రధాన అజెండాగా చర్చించేందుకు ఐదురోజుల ప్రపంచ ఆర్థిక సదస్సు సమావేశాలు బుధవారం ఇక్కడ ప్రారంభమైనాయి. సమ్మిట్ ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ (పిడబ్ల్యుసి) విడుదల చేసిన ప్రపంచ సిఇఓల సర్వే నివేదికలో విశ్వ ఆర్థికరంగ ప్రగతిపై విశ్వాసం సన్నగిల్లిన వైనం స్పష్టమైంది. తమ కంపెనీల ఆదాయ వృద్ధి పట్ల ఆయా సిఇఓలు ఎంతో ఆశాభావాన్ని వ్యక్తం చేసినప్పటికీ ప్రపంచ ఆర్థిక పురోగతి విషయంలో మాత్రం విశ్వసనీయత ప్రకటించలేక పోయారు. కాగా, డబ్ల్యుఇఎఫ్ వార్షిక సమావేశం తొలి సెషన్‌లో పెట్టుబడిదారీ విధానం: 21వ శతాబ్దం అనే అంశంపై చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాధిపతులు సమ్మిట్‌కు హాజరవుతున్నందున ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్విస్ సైన్య ం, పోలీసు బలగాలను భారీ సంఖ్యలో మోహరించారు. జర్మనీ చాన్స్‌లర్ అంలా మెర్కెల్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సహా 40 దేశాల అధినేతలు, ఐఎంఎఫ్, ప్రపం చ బ్యాంక్, ఓఇసిడి, డబ్ల్యుటిఓ వంటి సంస్థల అధిపతులు సదస్సుకు హాజరవుతున్నారు. ఇక భారత్ నుంచి ముఖేష్ అంబానీ, అజీం ప్రేమ్‌జీ, సునీల్ మిట్టల్, ఆదిగోద్రెజ్, రాహుల్ బజాజ్ తదితర బిజినెస్ లీడర్లతో పాటు వాణిజ్య మంత్రి ఆనంద్‌శర్మ, ఇతర యువ మంత్రు లు, ఆర్థిక ప్రముఖులు హాజరవుతున్నారు.
===============

Comments

I am very happy to read this. This is the kind of details that needs to be given and not the random misinformation that is at the other blogs. Appreciate your sharing this greatest doc. her hcg diet drops her hcg order her hcg

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading