రాష్ట్రీయం

అమెరికాలో యద్దనపూడి సులోచన కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి (79) కాలిఫోర్నియా రాష్ట్రంలో (యు.ఎస్.ఏ)లో కుపర్టినో పట్టణంలో ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశారు.ఈ విషయాన్ని వారి కుమార్తె శైలజ తెలిపారు. యద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో జన్మించారు. కుటుంబ కథనాలు రాయడంలో ఆమె తనకు తానే సాటి. ఆమె రాసిన అనేక నవలలు.. సినిమాలు, టీవీ సీరియళ్లుగా తెరకెక్కాయి. ఆరాధన, అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, రుతువులు నవ్వాయి, కలల కౌగిలి, ప్రేమ పీఠం, బహుమతి, బంగారు కలలు, మౌనతరంగాలు, శ్వేత గులాబి, సెక్రటరీ తదితర నవలలు రచించారు. ఆమె రచనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నవల ‘మీనా’. దీని ఆధారంగానే ‘మీనా’ చిత్రం తెరకెక్కింది.