మెయిన్ ఫీచర్

యాజ్ఞసేని 29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయితే కుంతీదేవి తెచ్చిన భిక్ష ఏమిటో తెలియక ఎప్పటిలాగే భావించి.. ‘‘దానిని మీ అయిదుగురూ ఉపయోగించండి’’ అని కొడుకులను ఆజ్ఞాపించింది.
తరువాత ద్రౌపదిని చూచి సిగ్గుపడి అధర్మానికి భయపడి ధర్మరాజుతో ఏమి చేయాలని ఆవేదన పడింది.
‘‘అయ్యో! ఇలా అన్నానేమిటి? పరమ ప్రఖ్యాతిగాంచిన ఈమె ద్రుపద రాజ కుమార్తె. నీ తమ్ములు ఆమె చెయ్యి పట్టుకొని వచ్చి భిక్ష తచ్చామన్నారు. వెంటనే నేను కలిసి భుజించండి అని అన్నాను. ప్రమాదపడి నేను మాట్లాడింది అసత్యమెలా అవుతుంది’’ అని ఆవేదనతో ధర్మరాజుతో అన్నది.
అంత ధర్మరాజు ద్రౌపదిపై అనురక్తులైయున్న తమ అయిదుగురి అభిప్రాయం తెలిసికొని వేదవ్యాస మహర్షి మాటలను తలంచి తమ్ములతో...
‘‘పెద్దల మాటల ప్రకారం మన అయిదుగురికీ ఈమె భార్య కాగలదు. కావున నిశ్చితంగా ఈమెను మనం వివాహం చేసుకొందాము. పెద్దల మాట వ్యర్థం కాదు గదా!’’ అని అన్నాడు.
18
ద్రౌపది లోలోన ఆవేదనతో నడిచింది.
కుమ్మరి ఇంట్లోకి ద్రౌపది సమేతులై భీమార్జునులు ప్రవేశించారు.
అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించగానే ధర్మరాజు నకుల సహదేవులతో కలిసి సభాస్థలి నుంచి నిష్క్రమించారు.
ద్రౌపది ప్రవేశించిన ఆ కుమ్మరి యిల్లు సువిశాలమైన గృహమేమీగాదు. ఒకే ఒక్క పెద్దదైన నివాస యోగ్యమైన గది. అందులోనే పాండవులైదుగురు తల్లి కుంతీదేవితో కాలం గడుపుచున్నారు. ఇపుడు ఒక రాజకుమారి ప్రవేశించింది. రాజభవనంలో హంసతూలికా పాన్పుపై పవళించే కన్య, దాసదాసీజనంతో సేవలందుకొని సర్వసుఖాలను అనుభవించినది ఇపుడు ఎందునా సరితూగని ఒక మట్టి ఇంటిలో కాలుబెట్టింది. లోపలికి ప్రవేశించిన ద్రౌపది అత్త కుంతీదేవితో గదిలోని ఒకమూల భాగంలో కూర్చుంది. ఇంటినంతటినీ కలియజూచింది. అప్పటివరకు తాననుభవించిన భోగభాగ్యాలనూ, ఇకముందు తనకు కలుగబోయే సుఖ సౌఖ్యాలనూ తలంచుకొని ఒకింత కలత చెందింది. ఒక్కసారి గతమంతా స్మృతిపథంలో తిరుగసాగింది.
తన తండ్రి ద్రుపద మహారాజు ద్రోణాచార్యుడి చేతిలో అవమానింపబడ్డాడు. అర్జునుడు తన తండ్రిని పట్టి బంధించి ద్రోణాచార్యుడికి గురుక్షణగా సమర్పించాడు. ద్రోణుడు తన తండ్రిని పరిహసించి, అంతటితో ఊరుకున్నాడా! లేదే! తానే పాంచాల రాజ్యాన్ని రెండు ముక్కలు చేశాడు. గంగకు దక్షిణ భాగమైన, తన తాత పృషతుడు పాలించిన కాంపిల్య నగరంతోకూడిన పాంచాలము తన తండ్రికి దక్కింది. ఉత్తర పాంచాలాన్ని తాను అట్టిపెట్టుకొని దాన్ని తానే స్వయంగా పాలిస్తున్నాడు ద్రోణాచార్యుడు.
పాంచాల రాజ్యం ముక్కలైపోయింది. తన తండ్రి హృదయం బ్రద్ధలైంది. మనసులో ప్రతీకారేచ్ఛ ప్రబలంగా వ్రేళ్ళూనింది. తన సోదరులైన శిఖండి, ఉత్తవౌజుడు, యుధామన్యుడు, శత్రుంజయుడు మొదలైన వారెవరూ ద్రోణాచార్యునితో సరితూగరు. అతడిని జయించలేరు. ఒక సంవత్సర కాలం తన తండ్రి బ్రాహ్మణులున్న అగ్రహారాలన్నీ తిరిగాడు.
చివరకు గంగాతీరంలో తపసంపన్నులైన మునివర్యులు యాజోపయాజుల సహాయంతో యజ్ఞం చేసి ద్రోణుని వధించగల కుమారుని తన అన్న దృష్టద్యుమ్నుని యజ్ఞకుండంనుండి పొందాడు. పాండుసుతుడు, తనను పట్టి బంధించిన అర్జునునికి భార్యగా గల కూతురుగా తనను కూడా అదే యజ్ఞకుండం నుండి పొందాడు.
స్వయంవరానికి అర్జునుడు రాలేదు. ఎంతోమంది రాజులు మత్స్యయంత్రాన్ని ఛేదించలేక విఫలులయ్యారు. కానీ ఒక బ్రాహ్మణుడు ఆ మత్స్యయంత్రాన్ని పడగొట్టి తనను పొందగలిగాడు. విధి వైపరీత్యం. తన తండ్రి పడిన శ్రమంతా వృధా అయింది. ఒక రాజకుమారి ఒక బ్రాహ్మణునికి భార్య అయింది.
విధి నాకు వ్యతిరేక ఫలాన్ని ప్రసాదిస్తున్నది. స్వయంవరంలో నన్ను గెలిచినది ఒకడు. మెట్టినింట్లో అడుగుపెట్టిన తనకు మరో సమస్య ఎదురైంది. భిక్షను అందరూ పంచుకొనేటట్లు అత్త నన్ను గూడా అందర్నీ పంచుకొమ్మన్నది. ఇదేటి వైపరీత్యం. నేనిప్పుడెవరి భార్యను. అందరికీ భార్యనా లేక ఒకడికే భార్యనా? గతకాలము మేలు వచ్చు కాలముకంటే అనే చందాన అయింది నా పని అని పరిపరివిధాలా ఆవేదన పడింది.
ఆ విధాతే దీనికి పరిష్కారం చూపాలి అని మనస్సు గట్టి చేసికొని ఆ ఇంటిలో అత్తతో కలిసి ఒక మూల కూర్చుంది.

- ఇంకావుంది
***

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము