రాష్ట్రీయం

యాటపాక మండల పరిషత్ పరిధిలోకి మరికొన్ని గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్ర విభజన అనంతరం ఖమ్మం జిల్లా నుంచి ఏపిలో కలిసిన నాలుగు మండల ప్రజాపరిషత్‌లను పునర్‌వ్యవస్థీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీచేసింది. గతంలో జారీచేసిన ఉత్తర్వుల మేరకు నాలుగు మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన సంగతి తెలిసిందే. వీటన్నింటిని కలిపి తూర్పుగోదావరి జిల్లాలో ఏటపాక రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. కాగా యాటపాక మండల ప్రజాపరిషత్‌లో గతంలో విలీనం కాని ఖమ్మం జిల్లాకు చెందిన కొన్ని గ్రామాలను కలుపుతున్నట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో యాటపాక సహా నాలుగు మండల పరిషత్‌లను పునర్‌వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.