రాష్ట్రీయం

నృసింహ హోమం, పూర్ణాహుతితో యాగం పరిసమాప్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాగశాల తొలగింపు * విభూతి కోసం ఎగబడిన భక్తులు
సంగారెడ్డి, డిసెంబర్ 28: విశ్వశాంతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టిన అయుత మహా చండీయాగం వైదిక ప్రక్రియలన్నీ సోమవారం పరిసమాప్తం అయ్యాయి. ఐదు రోజుల పాటు నిర్వహించిన చండీ యాగం ఆదివారం నాటి పూర్ణాహుతితో పూర్తయింది. చండీ రూపాలైన మహాకాళి, సరస్వతి, మహాలక్ష్మి విగ్రహాల ఉద్వాసన కార్యక్రమం సోమవారం ఉదయం 11.55 గంటలకు ఎర్రవల్లిలోని యాగశాలలో ప్రారంభమైంది. శృంగేరి పీఠం నుంచి వచ్చిన ప్రధాన రుత్వికులు గోపికృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ, తంగిరాల శివకుమార్ శర్మల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా చేయాల్సిన ప్రక్రియలు పూర్తి చేశారు. చండీ రూపాల ముందు నరసింహ హోమం నిర్వహించి దానికి సంబంధించిన పూర్ణాహుతి జరిపారు. సిఎం కెసిఆర్ దంపతులు హోం చుట్టూ ప్రదక్షిణ చేశారు. రుత్వికులు భారతీ తీర్థ ఆశీర్వాదం, చండీమాత శృతి తీర్థం కెసిఆర్ కుటుంబ సభ్యులకు అందజేసారు.
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు కూడా ఈ పూజలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వేములవాడకు రాజన్న దర్శనం కోసం సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గంలో బయలుదేరారు. వేద మంత్రోచ్చారణల మధ్య ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన అయుత చండీ మహాయాగానికి సంబంధించిన పవిత్రమైన విభూతి కోసం భక్తులు ఎగబడ్డారు. సినిమా సెట్టింగులను తలపించే విధంగా నిర్మించిన యాగశాలను కనులారా వీక్షించడానికి భక్తులు ఎర్రవల్లి గ్రామానికి ఇంకా తరలివస్తూనే ఉన్నారు. క్యూలైన్ ద్వారా వచ్చిన భక్తులకు నిర్వాహకులు హోమ గుండాల్లోని విభూతిని పంచిపెడుతున్నారు. అమ్మవారి కటాక్షం కోసం చేపట్టిన విభూతిని నుదుట దిద్దుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విభూతి పంపిణీ వద్ద గందరగోళం నెలకొనకుండా క్యూలైన్‌లో వచ్చిన వారికి మాత్రమే విభూతిని అందజేశారు. అమ్మవార్ల విగ్రహాలను తొలగించిన అనంతరం యాగశాలను ఒక్కోదాన్ని తొలగింపజేస్తున్నారు. (చిత్రం) విభూతిని భక్తులకు పంచిపెడుతున్న దృశ్యం