రాష్ట్రీయం

మత్స్యావతారంలో యాదాద్రి నృసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 12: నల్లగొండ జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శనివారం స్వామివారు మత్స్వావతారం అలంకారంతో తీరువీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార ప్రియుడైన శ్రీవారు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఏడు రోజుల పాటు వివిధ అవతారాల అలంకారాలతో దివ్యవాహన రూఢుడై దర్శమిస్తారు. ఆలయ పడమటి రాజగోపురం నుండి అలంకార సేవ ఊరేగింపు ప్రారంభంకాగా వేలాది మంది భక్తులు సింహరూపుడైన నృసింహుడిని మత్స్యావతార మూర్తిగా తిలకించి పులకించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, మంగళగిరి నర్సింహ్మమూర్తి ఆధ్వర్యంలోని అర్చక బృందం అలంకార సేవ, వాహన సేవలను శాస్తయ్రుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్ధానం ఈవో ఎన్.గీత, చైర్మన్ బి.నరసింహమూర్తి, ఎఈవోలు దోర్బల భాస్కర్‌శర్మ, ఆకునూరి చంద్రశేఖర్, వేముల రామ్మోహన్ పాల్గొన్నారు.
నేడు కృష్ణావతారంలో హంసవాహన సేవ
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన ఆదివారం ఉదయం లక్ష్మీనరసింహుడు శ్రీ కృష్ణవతారం అలంకారంలో దర్శనిమిస్తారు. స్వామివారిని రాత్రి వేళ హంస వాహనంపై తిరువీధుల్లో విహరింపజేస్తారు.
ధార్మిక సభలు ప్రారంభం
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండపై సంగీతభవన్‌లో ధార్మిక మహాసభలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. జాయింట్ కలెక్టర్ ఎన్. సత్యనారాయణ ధార్మిక మహాసభలను జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. గత 170 సంవత్సరాలుగా యాదాద్రి కొండపై ధార్మిక సభలు కొనసాగుతుండడం స్వామివారి ఆశీర్వచనంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎన్.గీత, చైర్మన్ బి.నర్సింహమూర్తి, భువనగిరి ఆర్డీవో మధుసూదన్, డిఎస్పీ మోహన్ రెడ్డి, గుట్ట సిఐ రఘువీర్‌రెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు.