తెలంగాణ

చండీయాగం ఖర్చుకు లెక్కలు చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ నిర్వహిస్తున్న చండీయాగానికి ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో లెక్కలు చెప్పాలని కాంగ్రెస్ నేతలు దానం నాగేందర్, షబ్బీర్ అలీ, సర్వే సత్యనారాయణ, మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో భారీ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండగా మరోవైపు చండీయాగానికి ప్రభుత్వ నిధులను భారీగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. క్రిస్టియన్ భవన్‌కు శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా శిలాఫలకం తప్ప ఎలాంటి నిర్మాణం జరగలేదని వారు విమర్శించారు. హైదరాబాద్‌కు కాంగ్రెస్ హయాంలోనే అభివృద్థి పథకాలు దక్కాయని వారు అన్నారు.