అంతర్జాతీయం

యాంటీ శాటిలైట్‌తో శకలాల ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్:యాంటీ శాటిలైట్‌తో ఉపగ్రహాన్ని పేల్చటం వల్ల నాసాకు శకలాల ముప్పు వాటిల్లబోతుందని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ప్రయోగం వల్ల 400 శకలాలు ఏర్పడ్డాయని పేర్కొంది. పది సెంటీమీటర్ల పరిమాణంలో వున్న 60 శకలాలను గుర్తించామని తెలిపారు. ఏశాట్ ప్రయోగం ద్వారా భారత్ 300 ఎత్తులో ఉపగ్రహాన్ని ధ్వంసం చేసిందని, దీనిద్వారా వెలువడిన శకలాలు ఐఎస్‌ఎస్ కక్ష్య మీదుగా తిరుగుతున్నాయని, దీనివల్ల ఐఎస్‌ఎస్‌కు ముప్పువాటిల్లే అవకాశం ఉందని నాసా పేర్కొంది. ఏశాట్ ప్రయోగాన్ని భయంకరమైన చర్యగా అభివర్ణించింది. అంతరిక్షంలో మానవ మనుగడకు ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని పేర్కొంది. స్పేస్ స్టేషన్ కన్నా వ్యర్థాలు ఇంకా పైకి వెళ్లటం ఆందోళన కలిగిస్తుందని తెలిపింది. 2007లో చైనా నిర్వహించిన ఏశాట్ ప్రయోగం వల్ల మూడువేల వ్యర్థాలు తయారయ్యాయని నాసాకు చెందిన బ్రిడెన్ స్టయిన్ తెలిపారు.