ఆంధ్రప్రదేశ్‌

15వ శతాబ్దపు రేఖాచిత్రాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యర్రగొండపాలెం, డిసెంబర్ 29: 15వ శతాబ్దానికి చెందిన దేవాలయాల నమూనా రేఖాచిత్రాలు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మంగళవారం లభ్యమయ్యాయి. పురాతన దేవాలయమైన శ్రీ మిల్లంపల్లి వేణుగోపాలస్వామి దేవస్థానానికి దక్షణం వైపున పొలం శుభ్రం చేస్తున్న సమయంలో ఈ రేఖాచిత్రాలు లభ్యమయ్యాయి. గుంటూరుజిల్లా సిరిపురం గ్రామానికి చెందిన తక్కెళ్ళపాటి హుస్సేనయ్య యర్రగొండపాలెంలో పొలాన్ని కొనుగోలు చేశాడు. ఆ పొలం బీడుగా ఉండటంతో సాగు చేసేందుకు యంత్రాలతో సిద్ధం చేస్తున్న సమయంలో ఈ రేఖాచిత్రాలు కలిగిన శిలలు బయటపడ్డాయి. యర్రగొండపాలెం ప్రాంతంలోని దేవాలయాల నమూనా చిత్రాలు, మహిషాసురమర్థిని, ఆంజనేయస్వామి విగ్రహం నమూనా, శక్తిదేవతా విగ్రహాల నమూనాలు కనుగొన్నారు. విషయాన్ని తెలుసుకున్న పురావస్తుశాఖ అధికారి జ్యోతి చంద్రవౌళీ, మద్రాసు యూనివర్సిటీ ఆర్కియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వి శంకర్‌రావు ఆ నమూనాలను పరిశీలించారు. ఇదే పొలంలో పురాతనమైన గోడలు కూడా బయటపడ్డట్లు వారు తెలిపారు.
సాగర్‌కు 2633 క్యూసెక్కుల నీరు చేరిక
విజయపురిసౌత్, డిసెంబర్ 29: శ్రీశైలం రిజర్వాయర్ నుండి నాగార్జునసాగర్ జలాశయానికి మంగళవారం 2633క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ జలాశయం నీటిమట్టం 508.80 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 129.6422 టీయంసీలకు సమానం.విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 2490క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 143క్యూసెక్కులు, అవుట్‌ఫ్లోగా 2633క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 832.40 అడుగులకు చేరుకుంది. ఇది 62.055 టీయంసీలకు సమానం. ఎగువ జలాశయాలైన రోజా, తుంగభద్ర ప్రాజెక్టుల నుండి శ్రీశైలం జలాశయానికి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయింది.
ఏసిబికి చిక్కిన ఆర్‌అండ్‌బి ఏఇ
కర్నూలు, డిసెంబర్ 29: కాంట్రాక్టర్‌కు సంబధించిన బిల్లు ఫైలు ఉన్నతాధికారులకు పంపేందుకు రూ.15 వేలు లంచం తీసుకున్న కర్నూలు ఆర్‌అండ్‌బి ఎఇ విశ్వనాథ్‌ను ఎసిబి అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్టర్ పుల్లయ్య నుంచి ఎఇ డబ్బు తీసుకుంటుండగా అరెస్టుచేసినట్లు ఎసిబి డిఎస్పీ మహబూబ్‌బాష తెలిపారు.