రివ్యూ

వెంటాడే పీడకల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* యవ్వనం ఒక ఫాంటసీ (బాగోలేదు)

తారాగణం:
అరవింద్ కృష్ణ, శుభ్ర అయ్యప్ప, అశోక్‌కుమార్, ప్రభాస్ శ్రీను, షఫి, వైవా హర్ష, సుమన్‌శెట్టి, భార్గవి, సాధన, కుముంద, ప్రవీణ, చెమ్మక్ చంద్ర తదితరులు.
సంగీతం: జీవన్‌థామస్
దర్శకత్వం:
ప్రసాద్ నీలం

యవ్వనం వచ్చిందెందుకు? వెధవ పనులు చేసేటందుకు! సమాజాన్ని నాశనం చేయడానికి. ఎంతోకొంత మనదంటూ సమాజాన్ని కొంత నాశనం చేస్తేనే కదా మనిషిజన్మ ఎత్తినందుకు సార్థకత. ఇదే మాటని చెప్పే ప్రయత్నం చేసింది ‘్ఫంటసీ యవ్వనం’. చిన్నప్పటినుండి తల్లిదండ్రులు చెప్పిన నీతులు ఏమయ్యాయి. పాఠశాలలో గురువులు చెప్పిన పాఠాలు ఏమయ్యాయి? కేవలం సమాజాన్ని చూస్తూ నిబద్ధతతో బతకాలన్న ఆలోచనలు ఏమయ్యాయి? ఇవన్నీ కాదని ఎవరు దొరికితే వారి జీవితాలతో ఆటాడేసుకుంటూ సమాజాన్ని భ్రష్టుపట్టించడానికి పూనుకున్న ఓ కథానాయకుడి కథనమిది.
మూడు తరాలనుంచి కృష్ణుడి పాఠాలు నెమరేసుకునే వంశంలో పుట్టిన మూడో కృష్ణుడు క్రిష్ (అరవింద్ కృష్ణ). చేతినిండా డబ్బు. వెంటతిరిగే గ్యాంగ్. ఎక్కడికైనా తీసుకెళ్లే వాహనాలు. ఇంకేం కావాలి? ఏ వీధికి పోతే ఆ వీధిలో దొరికే ప్రియురాళ్లు. గల్లీకో పాన్‌షాపులా వీధివీధికో ప్రియురాలు. సినిమా అంతా ఇలా.. గల్లీనుంచి మరో గల్లీకి సాగుతూ సా..గింది! ఇందులో విషయమేముంది? అనుకుంటే అటుపక్క ఇటుపక్క వంతగాళ్లు (ప్రభాస్‌శ్రీను, వైవాహర్ష) సినిమాకు వచ్చిన వాళ్లను ఎంతగా భయపెట్టాలో అంతగా భయపెడతారు. ఇలా సాగే కథలో క్రిష్ జీవితంలో పెళ్లి ముచ్చట వస్తుంది. తండ్రి నిర్ణయించిన అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి ఒప్పుకుని, శతకోటి ప్రియురాళ్లకు అదంతా అబద్ధమని, నినే్న పెళ్లి చేసుకుంటానని మళ్లీమళ్లీ అబద్ధాలాడేస్తాడు. పెళ్లి మండపంలోకి ప్రియురాళ్లంతా చీపుళ్లు, కారాలు పట్టుకొస్తే వంతగాళ్లు వాళ్లను గదుల్లో బంధించేస్తారు. అలా పెళ్లి చేసుకుని భార్య సావిత్రి (శుభ్ర అయ్యప్ప)తో హనీమూన్ వెళ్తాడు. హనీమూన్‌లోనూ ప్రియురాళ్లు వదలరు. నానా రకాలుగా ఇబ్బంది పెడతారు. కొందరు డబ్బు తీసుకుంటారు. ఇంకొందరు పెళ్లి చేసుకోమని యాగీ చేస్తారు. ఈ గోలను హీరో ఎలా వదిలించుకున్నాడో చూసిన ఆడియన్స్‌కు బుర్ర వాచిపోతుంది. హారర్ ఒక్కట తక్కువన్నట్టు -దర్శకుడు గిఫ్ట్‌గా ఆ ఫెసిలిటీ కల్పించాడు. మనీ బ్యాగ్‌ను ఓ వేశ్య దయ్యం మాయం చేస్తుంది. బ్యాగ్ తెచ్చే క్రమంలో హీరో -దయ్యంతోనూ ప్రేమపాఠాలు వల్లిస్తాడు. ఓ పాటలో వచ్చినట్టు చూయింగమ్‌లో కాలెట్టినట్టు, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో బుక్కైనట్టు, ఫేస్‌బుక్ అమ్మాయి ఫేక్ ఐడి ఇచ్చినట్టు.. చూస్తున్న ఆడియన్స్‌కు సినిమా నానా రకాలుగానూ తోస్తుంది. రాముడిగా వస్తే వద్దన్నావ్.. రావణుడిగా వచ్చానన్న డైలాగ్‌లాంటికి అక్కడక్కడా ఒకట్రెండ్ పేలాయి. హాస్యం పైత్యం అతితో పరాకాష్టకు చేరినట్టు అనిపిస్తుంది.
హీరోకు నటించే చానే్స రాలేదు. హీరోయిన్‌తో కెమిస్ట్రీ కుదరలేదు. బోనస్‌గా వంతగాళ్ల గోల. నేపథ్య సంగీతం అందుకు తగ్గట్టే ఉంది. పాటల్లో ‘పడకు పడకు మీదపడకు’ ఒక్కటే వినడానికి ఓకే. మిగిలిన తారగణమూ సినిమాకు తగ్గట్టే చేశారు. సాంకేతికంగా క్రాఫ్ట్స్ ఉదాసీనంగా వ్యవహరించాయి. దర్శకత్వపరంగా నర్సరీ స్టాండర్డ్ దాటని సినిమా.

-సుజీత్