ఆంధ్రప్రదేశ్‌

విజయవాడలో రైల్వే జోన్ ఒప్పుకోం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ : విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ఒప్పుకునే ప్రసక్తి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్ నాథ్ బుధవారం అన్నారు. విశాఖపట్నంలోనే రైల్వే జోన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం తాను గతంలో ఐదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినట్లు చెప్పారు. విశాఖలోనే రైల్వే జోన్ ఏర్పాటుచేస్తున్నట్లు రైల్వే శాఖమంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారని, ఈ రోజు బీజేపీ , టీడీపీ నేతల మాటలు చూస్తుంటే అనుమానించాల్సి వస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో విశాఖలోనే రైల్వే జోన్ పెట్టాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు.