రాష్ట్రీయం

అన్ని రంగాల్లోనూ సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపన్నులకు దోచిపెడుతున్న మోదీ * సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
రాజమండ్రి, డిసెంబర్ 12: ఎన్‌డిఏ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో అన్ని రంగాల్లో సంక్షోభం తీవ్రమవుతోందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి చెప్పారు. శనివారం రాజమండ్రిలో సిపిఎం రాష్ట్ర విస్తృత సమావేశాలు ప్రారంభం సందర్భంగా సుబ్రహ్మణ్యమైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పేద ప్రజల పొట్టకొట్టి సంపన్నులకు దోచిపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, కందిపప్పు ధర రూ.200కు చేరుకుందన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు మోది ప్రభుత్వ హయాంలో తొమ్మిదిసార్లు పెరిగాయన్నారు. పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడిదారులకు రాయితీలు కల్పిస్తున్న కేంద్రప్రభుత్వం ప్రజలపై తీవ్రమైన భారాలను మోపుతోందన్నారు. ప్రధాన మంత్రి మోది విదేశీపర్యటనలు చేస్తూ విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారని, దేశంలోని అన్ని రంగాలను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పాకిస్థాన్‌తో అసలు చర్చలే ఉండవని మోది ప్రకటించారని, కానీ దానికి భిన్నంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్థాన్ వెళ్లి చర్చలు జరుపుతున్నారన్నారు. ప్రయివేటీకరణతోనే దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్రప్రభుత్వం చెబుతోందని, అదే నిజమైతే దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోందని సీతారాం ఏచూరి ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్రసంక్షోభంలోకి దిగజారుతోందన్నారు. గిట్టుబాటు ధర లభించకపోవటంతో రైతుల ఆత్మహత్యలు 29శాతం పెరిగాయన్నారు. పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, సేవల రంగాల్లో సంక్షోభం రోజు రోజుకూ పెరిగిపోతోందన్నారు. దీనివల్ల మన పిల్లల భవిష్యత్తు ఏమిటో అర్ధంకాని పరిస్థితి ఏర్పడిందన్నారు. సామాజికరంగం మరింత దారుణంగా దిగజారుతోందన్నారు. మతఘర్షణలు పెరిగిపోతున్నాయని ఏచూరి ఆందోళన వ్యక్తంచేసారు. లోక్‌సభ ఎన్నికలు తరువాత ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షాలు సిటి బస్సుకు సరిపడే సంఖ్యపడిపోయాని ఎద్దేవచేసారని, కానీ ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఆటోలో తిరిగే స్థాయికి దిగజారిందని, బీహార్ ఎన్నికల్లో సైకిల్‌పై తిరిగే సంఖ్యకు దిగజారుతుందని తాము ఆనాడే చెప్పామన్నారు. ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవటంతో ప్రజా ఉద్యమాలు పెరుగుతున్నాయని, ఢిల్లీలో ప్రతి రోజూ వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఆందోళనలు సాగిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం సారవంతమైన భూములను రైతుల నుండి రకరకాల పేర్లుతో లాక్కుంటోందన్నారు. ఇది అనేక వివాదాలకు దారి తీయబోతోందన్నారు. దేశంలో 40ఏళ్లు లోపు వయస్సు ఉన్న 70శాతం మంది యువకులు ఎర్ర జెండా ఉద్యమాలకు సహకరించాలని కోరారు. కోల్‌కతాలో డిసెంబరు చివరి వారంలో జరగనున్న సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకుంటామని, దానికి నాందిగానే ఇపుడు రాజమండ్రిలో రాష్ట్ర విస్తృత సమావేశాలు జరుగుతున్నాయన్నారు. సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఎ గఫూర్, మాజీ ఎంపి మిడియం బాబూరావు, ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) సభలో ప్రసంగిస్తున్న సీతారాం ఏచూరి