బిజినెస్

యథాతథంగా పన్నుల విధానం

  • 04/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: దేశ ఆర్థిక వృద్ధి మందగించిన నేపధ్యంలో రా నున్న బడ్జెట్‌లో కొత్తగా పన్నులు వి ధించకుండా ఇప్పుడున్న స్థాయలోనే కొనసాగించాలని భారత వాణిజ్య, పారిశ్రామిక ప్రతినిధులు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కోరారు. వారు శుక్రవారం ప్రణబ్‌తో బడ్జెట్ ముందు చర్చల్లో పాల్గొన్నారు. ఆరోగ్యసేవలను సేవల పన్ను పరిధిలోంచి తప్పించాలని, దేశంలో బొగ్గు గనులను ప్రైవేటీకరించాలని వారు డిమాండ్ చేశారు. ఈసం దర్భంగా జరిగిన సమావేశంలో ప్రణ బ్ ముఖర్జీ మాట్లాడుతూ భారత్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, ఇందులో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు తీవ్రమైనవని అన్నారు. ఈ సమస్య లను మనం కలిసికట్టుగా ఎదు ర్కోవాల్సిఉందని చెప్పారు. కాగా, సేవల పన్ను బేస్‌ను ప్రతికూల జాబితాను రూపొందించి విస్త రిం చాలని సమావేశంలో పరిశ్రమల ప్రతినిధులు కోరారు. వౌలికరంగ సంస్థలు, సెజ్‌లను మ్యాట్ పరిధి నుంచి తప్పించాలని కూడా వారు ప్రణబ్‌కు తెలిపారు.
బడ్జెట్ సం దర్భంగా ఇప్పుడున్న పన్ను రేట్లనే యథాతథంగా కొనసాగించాలని కోరాం. కార్పొరేట్ పన్ను సర్వీస్ పన్ను, ఎక్సైజ్ సుంకం తగ్గించాలని మంత్రికి తెలిపామని ఫిక్కి అ ధ్యక్షుడు ఆర్.వి.కనోరియా విలేఖ రులతో చెప్పారు. ఆరోగ్య రంగానికి వౌలికరంగం హోదా కల్పించాలని, దీనివల్ల చిన్న పట్టణాల్లో కార్పొరేట్లు ఆస్పత్రులు నెలకొల్పేందుకు ప్రో త్సాహం లభిస్తుందని మంత్రికి వివ రించామని సిఐఐ హెల్ తకేర్ జాతీయ కమిటీ చైర్మన్ నరేష్ త్రిహాన్ వెల లడించారు. బడ్జెట్ ముందు జరిగిన ఈ సమావేశానికి వాణిజ్య, ఆర్థిక శాఖల అధికారులతో పాటు ఐటిసి చైర్మన్ వై.ఎస్.దేవేశ్వర్, హెచ్‌యుఎల్ ఎండీ నితిన్ పరంజపే, సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసి తంతి, పారిశ్రమిక చాంబర్ల ప్రతినిధులు హాజరయ్యారు. విమానయానం, టెలికాం, విద్య రంగాలకు వౌలిక హోదా కల్పించాలని, 2013 మార్చి 31 వరకు ఎగుమతిదార్లకు వడ్డీరేటు సబ్‌వెర్షన్‌పథకాన్నికొనసాగించాలని వీరు ప్రణబ్‌కు సూ చించారు.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading