ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( ఫిబ్రవరి 19 నుండి 25 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆలోచనతో కూడిన సహకారంతో అనుకున్నవి సాధిస్తారు. పురోగతికి యోగ్యమైన పథకాలు యోగపడతాయి. ఆదాయ వ్యయాలు తృప్తినందుకుంటాయి. పనుల వత్తిడి వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త. నిరుద్యోగులకు శ్రమానుకూలంగా ఫలితాలు. విద్య, ఉద్యోగ, వ్యాపారాలు ఆనందాన్నిస్తాయి. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలితాలు. శ్రీమతి సహకారం యోగదాయకం. శుభకార్యాలలో పాల్గొంటారు. మాట విలువ సంతృప్తినిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

అవకాశాలకు అనుగుణంగా కార్యాలు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. మిత్రులు సాయపడతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. దంపతులు అనుకున్నవి సంయమనంతో పూర్తి చేస్తారు. మీ పనుల ద్వారా గౌరవ మర్యాదలు పొందుతారు. మీకు ఇబ్బందికరంగా మాట్లాడే వారుంటారు. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలితాలున్నా గతం కంటె మెరుగు. విందు వినోదాలలో పాల్గొంటారు. అన్నింటా శ్రద్ధ ఉత్తమం.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

మీ ముందున్న కార్యాలను విభజించుకొని ముఖ్యమైనవి వెంటనే పూర్తి చేయండి. ఆర్థిక వనరులను బట్టి మిగిలినవి పూర్తి చేయండి. స్ర్తిలు శుభవార్తలు వింటారు. వస్త్ర, వస్తువులు అందుకుంటారు. ఉద్యోగ అవకాశాలు శ్రమానుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి సమయం. ఆరోగ్యం జాగ్రత్త. సమిష్టి ఆలోచనలు కొన్నింట మంచిది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విజ్ఞాన రంగాలు మెరుగుపడతాయి. పరిచయాలు శుభాలను తీసుకువస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

లౌక్యంతో, నేర్పుతో కార్యాలు పూర్తి చేస్తారు. సమస్యలున్నా హితుల సాయంతో పరిష్కరించుకుంటారు. స్ర్తిలు ఒంటరిగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విలువైన ఆభరణాలతో అప్రమత్తంగా ఉండండి. ప్రస్తుత విషయాలను గతంలోకి వెళ్లకుండా పరిష్కరించుకోవాలి. నమ్మకంతో పనిచేస్తే లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు మెరుగవుతాయి. స్పెక్యులేషన్ లాభసూచితం. విలువైన ఆభరణాలు పొందుతారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

తొందరపాటు కూడదు. జయాపజయాలున్నా తృప్తిని పొందుతారు. ఆర్థిక నష్టాలు లేకుండా ఈ వారం జాగ్రత్త వహించండి. ఉద్యోగ, వ్యాపార, వృత్తులందు శుభాలను అందుకుంటారు. శుభ వర్తమానాలు వింటారు. మంచి అవకాశాన్ని పొందుతారు. శక్తివంచన లేకుండా పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. స్పెక్యులేషన్ గతం కంటె మెరుగు. చెడు గురించి ఆలోచించకండి. స్ర్తిలు మాట విలువను వృద్ధి చేసుకుంటారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి తరుణం.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
పరిధి, అవధులకు లోబడి మీరు చేపట్టేవి పూర్తి చేస్తారు. విజయం సాధిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వాటిని మీ పద్ధతిలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలందు పదోన్నతి, విలువలు, గౌరవాలు అందుకుంటారు. వృత్తులు, వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగులకు స్థిరత్వం. పోటీ పరీక్షలకు శ్రమానుకూల ఫలితాలు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఆర్థిక విజయాలుంటాయి.
తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
సుఖ సంతోషాలుంటాయి. పట్టుదలతో, సమయస్ఫూర్తితో విజయాలు అందుకుంటారు. వత్తిడి, ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలి. మిత్రులు మీ మాట ద్వారా వారి కార్యాలు పూర్తి చేసుకుంటారు. గురువుల, అధికారుల సహకారాలు అందుతాయి. వీలువెంట సహాయ సహకారాలను హితుల నుండి పొందాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపార, వినోద, న్యాయ, ఆర్థిక, సాంకేతిక రంగాల వారు విలువైన సమాచారాన్ని మార్పిడి చేసుకుంటారు. స్పెక్యులేషన్ మిశ్రమం.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
ఎదురుచూస్తున్న కార్యాలు తలవని తలంపుగా పూర్తవుతాయి. ఆర్థిక స్థితి తృప్తినిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలం. పరిచయాలు యోగదాయకంగా ఉంటాయి. మిత్రత్వం వృద్ధి. గతం కంటె ఈ వారం మంచి వార్తలు, శుభాలను అందుకుంటారు. ఆరోగ్యం అప్రమత్తం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ఊహించని సంతోషాలు చవి చూస్తారు. స్పెక్యులేషన్ ఫలప్రదం. కుటుంబ సభ్యులకు విజయం. అవకాశాలు మెరుగు పడతాయి. తొందరపాటు కూడదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

మీ మాట నేర్పుతో అనుకున్నవి సాధిస్తారు. పరిచయాలు ఉన్నతికి సోపానాలని గుర్తిస్తారు. పదవులు, బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది. పనులు హడావిడిగా చేయవద్దు. ఆర్థిక నిల్వలు తరుగుదల లేకుండా సులువుగా పనులు నిర్వహించుకోవాలి. కొన్ని చెల్లింపులు సంతోషాన్నిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు సమీక్షించుకోవలసి వస్తుంది. నగదుతో జాగ్రత్త. అన్నింటా అప్రమత్తత అవసరం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ఆహ్వానాలు అందుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. ఆలోచనలు అనేకం. అవకాశాలున్నా అన్నీ ఒకేసారి అందుకోలేం. ఆత్మీయుల కలయిక యోగదాయకం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, స్టేషనరీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్, ప్రింట్ మీడియా పరిశ్రమలు, ధాన్య వ్యాపారాలు మెరుగవుతాయి. పోటీ పరీక్షలకు ఇది సరైన సమయం. ఉద్యోగ అవకాశాలు.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండకపోవచ్చు. ఆలోచనలకు పెద్ద పీట వేయండి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైద్య, న్యాయ, రాజకీయ రంగాలు గతం కంటె మేలు అనిపిస్తుంది. స్ర్తిలు కావాల్సినవి అందుకుంటారు. అనుకున్న పనులు నత్తనడకన నడుస్తాయి. మంచిరోజులుంటాయి అనుకుంటూ ప్రయత్నించండి. పెట్టుబడులు వడివడిగా ముందుకెళ్లవు. ఓ వార్త మిమ్మల్ని సంతోషపరుస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆనందాలను ఇచ్చి పుచ్చుకుంటారు. అనవసరంగా ఎదురుచూడకుండా బాధ్యతతో వ్యవహరించాలి. ఆర్థిక లావాదేవీలు ఆలోచింపజేస్తాయి. ముందు అనుకున్నట్లు పనులు కాకపోవచ్చు. మాట పట్టింపులకు పోవద్దు. సమిష్టి వ్యవహారాలు మంచిది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ప్రయాణాలు ఆలోచింపజేస్తాయి. స్పెక్యులేషన్, పెట్టుబడులు అనుకూలం.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855