ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( ఏప్రిల్ 9 నుండి 15 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆర్థికంగా బాగానే ఉంటుంది. అయితే ఖర్చులను నియంత్రించుకోవాలి. అలజడి వద్దు. అజాగ్రత్త కూడదు. అనుకున్నవి పూర్తవుతాయి. దూరపు మిత్రులు దగ్గరకు వస్తారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వస్తు, వస్త్ర లాభాలున్నాయి. కుటుంబ పెద్దల సాయం అందుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలు గతం కంటె వృద్ధిలోకి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. స్పెక్యులేషన్ సంతృప్తి. వ్యక్తిగత సమాచారాలు బయటకు వ్యక్తీకరించవద్దు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఆధ్యాత్మిక భావనలు మెరుగవుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. శ్రమైక జీవితం గడపవలసి ఉంటుంది. శత్రుత్వం మిత్రత్వంగా మారుతుంది. స్ర్తిలు అనుకున్నవి సాధించుకుంటారు. వదంతులు నమ్మకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగాలు ఆలోచింపజేస్తాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటె బాగుంటాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలందు అప్రమత్తత వహించాలి. విదేశీ ప్రయాణాలు, కోర్టు విషయాలు కొలిక్కి వస్తాయి. విజయం సిద్ధిస్తుంది. పెద్దల సలహాలు, ఆశీస్సులు ఉంటాయి. ఓపికతో వ్యవహరించాలి. స్పెక్యులేషన్ మిశ్రమం.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

గతంకన్నా ప్రస్తుతం సమ్యక్ దృష్టి నెలకొంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. కుటుంబ సభ్యులతో సంయమనం పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు, ఆస్తి విషయాలు లాభిస్తాయి. వ్యాపార విస్తరణకు అవకాశముంది. ఎవరు చెప్పినా మీ స్వీయ నిర్ణయంపై ఆధారపడి వ్యవహరించండి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. శుభకార్యాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. అప్పులు తీరుతాయి. సుఖ సంతోషాలుంటాయి. ఆర్థిక లావాదేవీలు ఫలప్రదం. వ్యయ నియంత్రణ అవసరం. కొన్ని విషయాలు నత్తనడకన సాగినా చివరకు పూర్తవుతాయి. పరిచయం లేనివారితో మాట్లాడేటపుడు అప్రమత్తంగా ఉండండి. డబ్బు వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలు ఆలోచింపజేస్తాయి. విలువైనవి అందుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

మీ ప్రయత్నాలు సఫలీకృతం. ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. వృత్తి, వ్యాపార, వ్యవహార రంగాలు సఫలం. ఉద్యోగ రంగంలో ప్రమోషన్లు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలకు అనుకూలం. ఇంటి మార్పులకు అవకాశం. నేర్పు వహించండి. ఆత్మీయుల వ్యవహారాలు మెరుగవుతాయి. శుభకార్యాలు కలసి వస్తాయి. వాతావరణానికి అనుకూలంగా స్పందించాలి. ఆదరణ పెరుగుతుంది. ఆరోగ్యంపై దృష్టి నిలపాలి. స్పెక్యులేషన్ సఫలం. దంపతులకు శ్రమానుకూల ఫలితాలుంటాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

కార్యసాధనలుంటాయి. ధనం అందుతుంది. అప్రమత్తతతో వ్యవహరించాలి. శుభకార్యాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు విస్తృతం. వ్యాపార విస్తరణకు అవకాశముంది. స్ర్తిలు, వారి వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమస్యలు పరిష్కారమవుతాయి. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలితాలు. ఆస్తి విలువ ఆలోచింపజేస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. విద్యార్థులకు సదవకాశం. మీ కష్టం ఫలిస్తుంది.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

శ్రమానుకూల ఫలితాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార, వ్యాపార రంగాలు ఊపందుకుంటాయి. ఆర్థికంగా ఖర్చులున్నా నిలదొక్కుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకున్న కార్యాలు ప్రణాళికాబద్ధంగా పూర్తవుతాయి. అన్ని వ్యవహారాల్లో నెమ్మదితనం మంచిది. కాలయాపన చేయకండి. దూరపు బంధువుల రాక ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త పనులకు ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల విషయాలు ఆనందాన్నిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

పదవులు వస్తాయి. ఆదరణలు లభిస్తాయి. ధన యోగముంది. హితుల సాయం మెరుగవుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిశ్చయిస్తారు. బంధుమిత్రులు మీ రాకకై ఎదురుచూస్తూంటారు. ఎదుటి వారు ఏమనుకుంటారో అన్న ఆలోచనలు వద్దు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు గతం కంటె బాగుంటాయి. శ్రమానుకూలం స్పెక్యులేషన్‌లో మిశ్రమ స్పందన. ఆందోళనలు తగ్గించుకోండి. స్ర్తిలు కావలసినవి అందుకుంటారు. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

ఎదురు చూస్తూన్న అవకాశాలను సద్వినియోగ పరచుకుంటారు. స్వీయ నియంత్రణ, వీక్షణం అన్నింటా మంచిది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు తృప్తినిస్తాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవాలి. అనుకున్న విషయాలు నెరవేరి మీకు ఆహ్లాదాన్నిస్తాయి. దంపతులు సంయమనం పాటించాలి. ప్రయాణాలు శ్రమకు గురి చేస్తాయి. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. శుభకార్యాలు అనుకూలిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ప్రశాంతచిత్తంతో అనుకున్నవి సాధిస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సలహా, సంప్రదింపులతో హితులు సంతోషాన్ని వ్యక్తీకరిస్తారు. ఆర్థిక వనరులు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ మంచిది. మీ పనులు అనుకోకుండా కొన్ని పూర్తవుతాయి. దూర ప్రయాణాలుంటాయి. శుభకార్య విషయాల్లో చర్చలుంటాయి. ఆరోగ్యం యోగ్యంగా చూసుకోవాలి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. గౌరవ మన్ననలందు వృద్ధి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలు తృప్తినిస్తాయి. ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించటం మంచిది. ఆదాయ మార్గాలకై అనే్వషణ. ఉద్యోగానే్వషణ ఫలప్రదం. నిరుద్యోగులకు కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్త వారికి మీ సాయం అందుతుంటుంది. విందులు, వినోదాల్లో మీ వారితో కలిసి వెళతారు. స్పెక్యులేషన్ మిశ్రమం.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

అన్ని రంగాల వారికీ అనుకూలం. ముఖ్యంగా వ్యాపార, ఉద్యోగ, వృత్తి రంగాలు ఫలవంతం. దంపతులు కావలసినవి అందుకుంటారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్యం జాగ్రత్త. సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. అధికారుల అండదండలు అందుతాయి. శుభాల పరంపర కొనసాగుతుంది.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855