ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( జులై 16 నుండి 22 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక మాంద్యం నుంచి బయటపడతారు. ఆందోళనతో పనులు ప్రారంభించవద్దు. చేపట్టే వృత్తి, విద్య, వ్యాపార, ఉద్యోగ రంగాలు ఆలోచింపజేస్తాయి. అనుకూల వాతావరణంలో నిర్ణయాత్మకంగా ముందుకు వెళతారు. మీ సలహాలు సన్నిహితులకు ఉపకరిస్తాయి. అనుకోని విధంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తత వహించాలి. స్పెక్యులేషన్ ఫలప్రదం. మంచి వార్త ఒకటి మీకు గుర్తింపును తెస్తుంది.
వాదాలు, ప్రతివాదాలకు వెళ్లకండి. స్థితి మార్పులుంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
ఆలస్యంగానైనా పైకం సర్దుబాటవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్ర్తిలు కుటుంబ సభ్యులతో కలిసి హితమైన కార్యాలు చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రియల్ ఎస్టేట్ గాడి తప్పకుండా చూసుకోవాలి. స్థల మార్పు. పరిసరాలకు అనుగుణంగా మారండి. దంపతులు అనుకున్నవి పొందుతారు. మిత్రుల సాయం అందుతుంది. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ప్రయాణాలందు సుఖం. నగదుతో వర్తన జాగ్రత్త. మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలి. విదేశీ యత్నాలు అనుకూలిస్తాయి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక సమస్యలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో పొరపొచ్చాలు లేకుండా మెలగండి. ధైర్యంతో ముందుకు వెళ్లండి. సంతానరీత్యా సౌఖ్యం. సఖ్యత మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపార వ్యవహారాదులు సంతోషాన్నిస్తాయి. ఉద్యోగ మార్పులు, పదవీ విరమణలు, అనుకోని పైకం వచ్చే అవకాశాలున్నాయి. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి. సంతృప్తి. అనుకున్నదొకటి జరిగేది మరొకటిలా ఉంటుంది. పట్టుదలతో, మెళకువలతో జయం. స్పెక్యులేషన్ శుభప్రదం.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
ఆర్థిక శాంతి ఉంటుంది. వాహన ప్రమాదాలు రాకుండా జాగ్రత్త పడండి. అన్నింటా అప్రమత్తత మేలు. ఊహించని సంఘటనలు ఇబ్బంది పెట్టేట్లున్నాయి. సంతానంతో ఇబ్బందులు సరిదిద్దుకోవలసి వస్తుంది. విలువైన వస్తువులతో ప్రయాణం జాగ్రత్త. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి, వ్యాపార వ్యవహారాలు, ఉద్యోగ రంగాలు తృప్తినిస్తాయి. ఆలోచనాత్మక ధోరణి మంచిది. పెట్టుబడి రాబడికి మేలు చేస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. అన్నింటా ఈ వారం జయాన్ని చూస్తారు. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. రావలసిన పైకం అందనుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగ, వ్యవహార రంగాలు ఫలవంతమవుతాయి. కుటుంబ సభ్యులు, మిత్రులతో సంతోషంగా మెలిగే అవకాశం ఉంది. విలువైన వస్తువులు చేజారే అవకాశముంది. జాగ్రత్త వహించండి. పైకం ఇతరులకు ప్రస్తుతానికి ఇవ్వకండి. అనవసరంగా మాటలు పడాల్సి వస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
ఆర్థిక మెళకువలు పాటించండి. వ్యయ నియంత్రణ మంచిది. భేషజాలకు వెళ్లకండి. ఆకస్మిక ప్రయాణాలుండేట్లున్నాయి. వాహన సౌఖ్యం. వాహన మార్పులకు అవకాశం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగాలు లాభాలను ఇచ్చేట్లున్నాయి. భార్యాభర్తలు సంయమనంతో సంతోషాన్ని అందుకుంటారు. చోర భయం లేకుండా జాగ్రత్త వహించాలి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
పరిష్కార దిశగా సమస్యలు సర్దుకుంటాయి. కుటుంబంలో ఆనందం చోటు చేసుకుంటుంది. వృత్తి, ఉద్యోగాలందు బాధ్యతగా వ్యవహరించాలి. వ్యాపార వ్యవహారాలందు మార్పునకు లోనవుతారు. మిత్రుల సాయం అనుకోకుండా అందుతుంది. జీవనోపాధికై మార్గాలు సుగమం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ప్రైవేటు ఉద్యోగులకు ఆర్థిక సౌలభ్యం. ఆరోగ్యం జాగ్రత్త. స్పెక్యులేషన్ మిశ్రమం. వాదాలు, ప్రతివాదాలకు వెళ్లకండి. స్థితి మార్పులుంటాయి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయం కంటె వ్యయం ఎక్కువ వుండేట్లుంది. చేపట్టే పనులు మార్పునకు లోనవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహార రంగాలు గతం కంటె ఫలవంతమవుతాయి. మీ కర్తవ్యాలు గుర్తించాలి. అన్నిటా ప్రణాళికా బద్ధంగా సాగండి. అనుకోని మార్పులు ఉంటాయి. శ్రద్ధ మెరుగుపరచుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. పెద్దల సలహాలు, ప్రశంసలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా ఉండనున్నాయి. పట్టుదలతో, మెళకువలతో జయం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
బకాయి పనులు పూర్తి చేసే అవకాశాలున్నాయి. సమయానికి పైకం అందుతుంది. ప్రయాణాలు అవసరాల మేరకే చేయండి. విలువైన వాటిలో మీ పెట్టుబడులు నిపుణుల సలహాలు, మీ నిర్ణయాలకు అనుకూలం మేరకు మార్చుకోవాలి. ఆలోచనాత్మక నిర్ణయాత్మక నిబద్ధత మంచిది. పోటీ తత్వం అన్నింటా అధికం. నిరుద్యోగులకు శ్రమానుకూల సౌలభ్యం. కుటుంబ సభ్యుల మధ్య చక్కని అవగాహన. సౌఖ్యప్రదం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
ఒత్తిడులకు గురి కాకుండా ప్రవర్తించండి. ఆర్థిక స్థితి పరిస్థితులకు అనుకూలం. ప్రయాణాలందు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహించండి. ఉపాధి మార్గాలు కావలసిన వారికి మెరుగవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ఇతరుల సలహా, పెద్దల కనుసన్నల మధ్య ముందుకు సాగుతాయి. అన్నింటా అదనపు బాధ్యతలు ఉంటాయి. మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
అనుకోని వాతావరణంలో లౌక్యంతో పనులు కొనసాగిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆలోచింపజేస్తాయి. శ్రద్ధతోనే కార్యసిద్ధి. కలహాలకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు లాభిస్తాయి. ధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటుతో తప్పటడుగులు వేయకండి. ఎవరినీ పూర్తిగా విశ్వసించకండి. కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. శుభవార్తలు వింటారు. పెట్టుబడికి జాగ్రత్తలు తీసుకోండి. స్వయంప్రతిపత్తి విజయాలకు మూలం.
మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ, వ్యాపార, వృత్తులందు వృద్ధిని చూస్తారు. ఆస్తులు పొందే అవకాశాలున్నాయి. వ్యక్తిగత విషయాదులందు గోప్యత పాటించండి. కుటుంబ సభ్యులను కొన్ని విషయాలందు సంప్రదించే అవకాశాలున్నాయి. సహకారం అందుతుంది. హితులకు మీ మాటలు ఉపకరిస్తాయి. శుభవార్తలు వింటారు. ప్రయాణ ప్రయోజనాలున్నాయి. సంయమనం పాటించండి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855