ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? (జులై 23 నుండి 29 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక ప్రగతి. అనుకున్న పనులు ఆలస్యంగానైనా పూర్తవుతాయి. చేపట్టే కార్యాలు హితుల సాయంతో పూర్తి చేస్తారు. స్ర్తిలు లౌక్యంతో ముందంజలో ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు సంతృప్తిని ఇస్తాయి. అనుకోని సంఘటనలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. కొత్త పరిచయాల విషయంలో ఆలోచించాలి. అప్రయోజన పనుల జోలికి వెళ్లకండి. కుటుంబ సభ్యులు ఇబ్బంది పడేట్లున్నారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పెట్టుబడి అవసరమైన మేరకే పెట్టాలి. పనులందు సతమతమయ్యేట్లున్నారు. మంచి ఫలితాలు ఉంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

సమయానికి పైకం అందుతుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. పొదుపు చర్యలు పాటిస్తే రాబోయే కాలంలో ఉపయోగపడుతుంది. అనుకోని ప్రయాణాలు ఆలోచింపజేస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, విద్య, సాంకేతిక రంగాలు గతం కంటె భిన్నంగా ఉండేట్లున్నాయి. బరువు బాధ్యతలకు అనుగుణంగా ప్రవర్తించండి. అంది వచ్చిన వనరులను చాకచక్యంతో ఉపయోగించుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. దంపతులు నిర్ణయాత్మకతతో మంచి కార్యాలు పూర్తి చేస్తారు. విలువైనవి అనుకోకుండా పొందే అవకాశాలున్నాయి.
మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

పర్యవసానానికై ఎదురుచూడకండి. దైవబలంతో అనుకున్న పనులు పూర్తి చేయాలి. ఇతరుల సలహాలున్నా మీ నిర్ణయాలకు అనుగుణంగా మెలగండి. పనులలో ఇబ్బందులు లేకుండా చూసుకోండి. ఆర్థిక నియంత్రణ ముందు ముందు లాభిస్తుంది. మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ఇతరులను ఆశ్చర్యపరుస్తాయి. స్పెక్యులేషన్ దీర్ఘకాలిక ఫలాలను అదిస్తుంది. సంతాన ప్రాప్తి. విదేశీ వ్యవహారాలు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలున్నాయి. ఆందోళనలు దరికి రానీయకండి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
నిరాశను దరికి రానీయకండి. ఆర్థిక వనరులు అందుకుంటారు. స్ర్తిలు అన్నింటా సాయపడతారు. నిరర్థకమైనవి వదిలించుకోండి. మిత్రులు ఎడమొహం పెడమొహంగా ఉండేట్లున్నారు. మెల్లిగా అన్నీ సర్దుకుంటాయి. వృత్తులందు సామాన్యం. వ్యాపారంలో అనుకోని మార్పులు. ఉద్యోగ రంగం విస్తరణ, మార్పులకు అవకాశం. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యంలో మెళకువ అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
సంశయాత్మకంగా నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక లావాదేవీలు సంతోషాన్నిస్తాయి. పనులు ఇతరుల సాయంతో పూర్తి చేస్తారు. మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ, విద్య, సాంకేతిక రంగాలు బుధ, శుక్రవారాల్లో శుభకరమైన మార్పులుంటాయి. అనవసరంగా ఇతరులు మిమ్మల్ని మాటలు అంటారు. అన్నింటా పోటీ పెరుగుతుంది. వౌనం మేలు. రాబడికి పనికొచ్చే ప్రభుత్వ పథకాలందు పెట్టుబడి క్షేమకరం. ముఖ్యమైన పత్రాలున్నా అన్నింటా ఆలస్యం గోచరిస్తోంది.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
అనారోగ్యంతో ఏ పనులు తలపెట్టకండి. ఆర్థిక విస్తరణ. మిత్రులు సాయపడతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వైద్య, రియల్ ఎస్టేట్ రంగాలలో శ్రమానుకూలంగా వ్యవహరించాలి. విద్యార్థులు శ్రమకు గురైనా మంచి ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగ రంగంలో అభివృద్ధి. స్నేహ సంబంధాలు విస్తరిస్తాయి. ముఖ్యులను కలుసుకుంటారు. ప్రయోజన పరంపర కొనసాగుతుంది. స్పెక్యులేషన్ మిశ్రమం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
ఆర్థిక ప్రగతి. హామీలను నిలబెట్టుకోండి. పరిచయాలు విస్తరిస్తాయి. హడావిడిగా పనులు చేయకండి. బంధువుల రాక ప్రయోజనకరం. అనుకోని ఉపకారాలు అందుకుంటారు. ఆరోగ్యం అప్రమత్తం. కుటుంబ సభ్యులకు అవసరమైన సలహాలు ఇవ్వవలసి వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలు తొందరపెడతాయి. శుభ వార్తలు వింటారు. స్పెక్యులేషన్ విస్తరణ స్థిరీకరణ వృద్ధికి దగ్గరవుతుంది. నిరుద్యోగులకు శుభ సమయం. దంపతులు వదంతులు నమ్మకండి. ధైర్యం వహించండి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
మీదైన విధి విధానాల్లో రాణిస్తారు. మీ పథకాలు ప్రయోజనకారిగా ఉంటాయి. సదాలోచనలతో ముందుకెళ్లండి. పెద్దల ఆరోగ్య సంరక్షణ చూసుకోండి. అన్ని వ్యవహారాలు ఆలోచింపజేస్తాయి. ఎదురుచూస్తున్న కార్యాలు కుంటుపడతాయి. స్పెక్యులేషన్‌లో సమస్యలు లేకుండా చూసుకోండి. దూరంగా వున్న దంపతులు ఆత్మీయతతో దగ్గరవుతారు. అనుకోని ప్రయాణాలుంటాయి. అప్రమత్తత అన్నింటా మంచిది. ఆలోచన, కలుపుగోలుతనం మేలు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

సన్నిహితుల సాయంతో ఈ వారం పనులు చేయవలసి వస్తుంది. ఒకటుంటే, మరొకటికై ఎదురుచూడవలసి వస్తుంది. వ్యాపార విస్తరణకు పథకాలు విస్తరిస్తాయి. వృత్తి విధులందు సమూల మార్పులు. సాంకేతిక, ముద్రణ, స్టేషనరీ, చిరు వ్యాపారాలందు ఉన్నతి. స్పెక్యులేషన్ ఫలప్రదం. స్ర్తిలు కావలసినవి అందుకుంటారు. ప్రోత్సాహాలు కొనసాగుతాయి. చిన్నచిన్న పనుల వల్ల గుర్తింపును అందుకుంటారు. విలువైన జీవితానికి శ్రీకారం చుడతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

మీ సమర్థత అన్నింటా గుర్తింపుని తెస్తుంది. సమయానికి పైకం అందుతుంది. మీ ప్రయత్నాలకు ఉన్న పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో కలిసి వినోద సమావేశాల్లో పాల్గొంటారు. అన్నింటా మెళకువ మంచిది. మిత్రులు సాయపడతారు. అవధులు మించి మాట్లాడకండి. పొట్లాటలు లేకుండా, పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. వ్యయ నియంత్రణ చేసుకోవాలి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
శుభ కార్య పరంపరలకు శ్రీకారం. అన్నింటా శుభకరం. క్షేమకరమైన విధానాలకు అనుగుణంగా మెలగాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, సాంకేతిక, వ్యవసాయ, ప్రింట్ మీడియా, ప్రచురణ, కార్యాచరణ రంగాలు విస్తరణకు అవకాశం. స్ర్తిలు వ్యవహారాలు సరిగా పూర్తి చేస్తారు. హితులతో ఎదురుదెబ్బలు లేకుండా చూసుకోండి. విందులు, వినోదాలలో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. వంచనకు గురికాకుండా చూసుకోండి. ధైర్యంగా మెలగండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక సమస్యలు లేకుండా ఈ వారం అన్ని పనులు పూర్తి చేయనున్నారు. అనుకోని పైకం అందేట్లుంది. పెట్టుబడులు, పొదుపు పథకాలకు తప్పక కొంత సమయం కేటాయించండి. విశే్లషణ అన్నింటా మంచిది. మీ మాటకు విలువ వృద్ధి. మీ సాయంతో హితులకు అభివృద్ధి. వృత్తి, వ్యాపార, వ్యవహార రంగాలందు అప్రమత్తత మంచిది. ఉద్యోగ మార్పులు. ప్రమోషన్లకు అవకాశం.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855