ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? (ఆగస్టు 6 నుండి 12 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
అర్థ లాభం. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. వాహన మార్పు, సౌఖ్యం. అనుకోకుండా ఓ ఇబ్బంది ఎదురయినప్పటికీ లౌక్యంతో ఎదుర్కొంటారు. పనులు ఉత్సాహంతో చేయాల్సి ఉంటుంది. కోపతాపాలు తెచ్చుకొని ప్రయోజనం లేదు. ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, సాంకేతిక వృత్తులందు దృష్టిని నిలపాలి. శుభకార్యాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబ సభ్యుల సాయం అందుతుంది. స్పెక్యులేషన్ అనుకూలిస్తుంది. ఒక వార్త మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
చేసే పనులు శుభాలను సూచిస్తున్నాయి. ధన లాభముంది. స్ర్తిలు మంచి వార్తలు వింటారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాదులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, స్థల విషయాలు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. ఇతరులను తేలికగా నమ్మవద్దు. ఆంతరంగిక విషయాలందు గోప్యత పాటించండి. స్పెక్యులేషన్ మిశ్రమం. దంపతులకు పరీక్షా కాలం. విద్యార్థులకు శ్రమానుకూలం మంచి తరుణం. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలందు అనుకోని శుభాలను చూస్తారు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక బలం చేకూరుతుంది. మిత్రుల సాయంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్వీయ నిర్ణయాలు మేలు చేస్తాయి. వృత్తి, వ్యాపార, వ్యవహారాదులు పరిశీలనాత్మకంగా ఉంటాయి. ఉద్యోగ రంగంలో మార్పులు. కొత్త పనులు చేపడతారు. శుభకార్యాలు కలసి వస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. స్పెక్యులేషన్ నత్తనడక నడుస్తుంది. గౌరవ మన్ననలు అందుకుంటారు. మీ విలువ పెరుగుతుంది. గుర్తింపును అందుకుంటారు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ఏకాగ్రతతో ఆర్థిక లబ్ధి. స్వీయ నిర్ణయాలు అనుకూలం. అనుకోకుండా పైకం అందుతుంది. చేపట్టే వృత్తి, వ్యాపారాలు ఫలప్రదం. ఉద్యోగాలందు అనుకోని మార్పులు. స్ర్తిలు అనుకున్నవి సాధిస్తారు. ప్రయాణాలున్నాయి. వివాదాల జోలికి వెళ్లకండి. హితుల సాయం అందుకుంటారు. పెట్టుబడికి మార్గాలు సుగమం. మాట పట్టింపులకు పోకండి. అనుకోని శుభాలకు శ్రీకారం చుడతారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ధన లాభం. నియంత్రం అన్నింటా మేలు. ఆరోగ్యం జాగ్రత్త. ఇతరుల మాటలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. తెలివితో ఆలోచించండి. అభివృద్ధిపై దృష్టి ఉంచండి. బంధుమిత్రుల అండదండలుంటాయి. దంపతులు సంయమనంతో పని చేయాలి. కుటుంబ సభ్యుల సాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. స్పెక్యులేషన్ దీర్ఘకాలికంగా ఫలితాలనిస్తుంది. ఓ సమస్య మీ ప్రమేయంతో పరిష్కారమవుతుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
మనసుకు నచ్చినట్లు లౌక్యంతో ముందుకెళ్లండి. ఆర్థిక వృద్ధి. సాహస కార్యాలు చేయనున్నారు. విదేశీ ప్రయాణాలు, ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలు మీకు అనుకూలంగా శుభ ఫలితాలను ఇస్తాయి. ఇతరుల ప్రమేయం లేకుండా మీ సమస్యలను మీరే పరిష్కరించుకొంటారు. స్పెక్యులేషన్ మిశ్రమం. దంపతులకు శుభ సమయం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
తొందరపాటు మంచిది కాదు. ధనప్రాప్తి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలకు అవకాశాలు. అధికారుల ఆశీస్సులు అందుతాయి. అనుకోని ఖర్చులు వున్నా ధనం అందుబాటులోకి రావటంతో ఇబ్బందులుండవు. కుటుంబ సభ్యులతో కలిసి ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం. విదేశీ ప్రయత్నాలు అనుకూలం. దంపతులు కలసి కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు. సంతాన సౌఖ్యం. స్పెక్యులేషన్ దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తుంది. వాగ్దానాలు చేయకండి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక ప్రగతి. యాదృచ్ఛికంగా మీ పనులు ఇతరుల సాయంతో పూర్తి చేస్తారు. లక్ష్యాలను నిర్దేశించుకుని కార్యాలు పూర్తి చేయటం మంచిది. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు ఆలోచింపజేస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. కచ్చితత్వం అన్నింటా పాటించండి. సమయాన్ని వృథా చేయకండి. స్ర్తిల వ్యాపార దక్షత ఆహ్లాదాన్నిస్తుంది. శుభాలు అందుకుంటారు. స్పెక్యులేషన్ దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తుంది. వాగ్దానాలు చేయకండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
ఆర్థిక లావాదేవీలు ఆలోచింపజేస్తాయి. అన్నింటా క్లిష్ట సమయం. అదను తప్పి వ్యవహరించకండి. మిత్రుల సాయం అవసరాన్నిబట్టి తీసుకోండి. వివాదాలు వద్దు. పెద్దల సాయంతో కార్యసిద్ధి. స్పెక్యులేషన్ మిశ్రమం. అనుకోని మాటలు వింటారు. వృత్తి, ఉద్యోగులకు పరీక్షా సమయం. ఒత్తిడి తగ్గించుకోండి. శుభకార్యాల ప్రయత్నాలు ముందుకెళతాయి. ఓ సమస్య మీ ప్రమేయంతో పరిష్కారమవుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
జయావకాశాలు. కార్యసిద్ధి. తొందరపాటుతనం ఇబ్బందికరం. ఆలోచన మీకు శ్రీకరం, శుభకరం. శ్రద్ధతో పనులు వేగవంతం చేయవలసి వస్తుంది. పొరపాట్లకు అవకాశం ఇవ్వకండి. స్ర్తిలు అనుకున్నవి అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. అనవసర కాలయాపనలు వద్దు. పెట్టుబడులకై పథకాలు ఆలోచించాలి. లౌక్యం అన్నింటా మంచిది.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

నిరుత్సాహపడకండి. బుద్ధిబలాన్ని ఉపయోగించండి. ఆర్థిక సమస్యలున్నా గట్టెక్కుతారు. మిత్రుల సూచనలతో, బాధ్యతలు మీరే చూసుకోండి. ఆదాయానికి అనుకూలంగా వ్యయం. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ప్రశాంతంగా నిర్వర్తించుకోండి. వాహన సౌఖ్యం. శుభకార్యాలుంటాయి. సంకల్ప శక్తి ఉపయోగపడుతుంది. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది. మీ విలువ పెరుగుతుంది. గుర్తింపును అందుకుంటారు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
దూరదృష్టితోనే కార్యసిద్ధి. శుభకార్యాలు అనుకూలిస్తాయి. ఏకాగ్రత మేలు. పొదుపు చేయండి. ఖర్చులు అదుపులో పెట్టండి. సంబంధాలు దగ్గరవుతాయి. ఆనందంగా ఉంటుంది ఈ వారం. నూతన కార్యాలు ఆరంభిస్తారు. గుర్తింపు, రాణింపుతో ముందుకెళతారు. వృత్తి ఉద్యోగాదులు సంతోషాన్నిస్తాయి. అభివృద్ధికి శ్రీకారం చుడతారు. స్పెక్యులేషన్ లాభదాయకం.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855