ఎలావుందీ వారం?

ఎలా ఉందీ వారం? ( సెప్టెంబర్ 17 నుండి 23 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

అర్థ తృప్తి. కార్య స్వల్ప సిద్ధి. అనుకోని ప్రయాణాలు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. మిత్రులు ఆకస్మికంగా మీ పనులందు సాయపడతారు. వృత్తి, వ్యాపారాలందు అనుకోని మార్పులు, బదిలీలు, ప్రమోషన్లు, స్థాన చలనాలు ఉన్నాయి. శుభకార్యాల ప్రయత్నాలు కొనసాగించనున్నారు. వాహనంపై ప్రయాణాల విషయంలో మెళకువ పాటించండి. అప్పులు తిప్పలు పెట్టేట్లున్నాయి. స్పెక్యులేషన్ దీర్ఘకాలిక ప్రయోజనాలిస్తాయి. అనుకోని సన్నిహితులు ప్రయోజనాలు అందిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఆర్థిక లావాదేవీలు కొనసాగుతాయి. ధన లబ్ధి. ఇంధన వ్యాపారులు, ఈవెంట్ మేనేజ్‌మెంట్స్, వృత్తులందు పోటీ తత్వం, ఉద్యోగ రంగంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. స్ర్తిలు శ్రమానుకూల ఫలాలను పొందుతారు. రాబడికై పెట్టుబడులు ఆలోచింపజేస్తాయి. స్ర్తిలతో ప్రయాణాలు ప్రయోజనకారిగా ఉంటాయి. స్పెక్యులేషన్ తృప్తినిస్తుంది. త్వరత్వరగా పనులు చేయకండి. హితులు కొన్ని విషయాల్లో నీరసాన్ని కలిగిస్తారు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

వైవిధ్య విధానంలో పైకం ఖర్చు పెడతారు. ఎంచుకున్న రంగాల్లో బహుమతులు అందుకుంటారు. వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగాలు విస్తరణకు, ప్రచురణ రంగాలలో ప్రగతిని అందుకుంటారు. స్పెక్యులేషన్‌కై ఎదురు చూడాల్సి వస్తుంది. పెద్దల ఆశీస్సులు వెన్నంటి ఉంటాయి. మాట పట్టింపులకు పోకండి. కుటుంబ సభ్యుల పనులందు మీ సహాయం అవసరమయ్యేట్టు ఉంది. సంగీత, సాహిత్య రంగాల వారు గుర్తింపును పొందుతారు. ఆరోగ్యం ఇబ్బంది పెట్టేట్టుంది. జాగ్రత్త వహించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ఇరకాటంలో పడకండి. బంధువుల రాకపోకలు ప్రయోజనకారిగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాలు ఆలోచింపజేస్తాయి. పనులందు తలనొప్పులు చోటు చేసుకోనున్నాయి. వైవిధ్య కార్యాలందు మీ నైపుణ్యం పెరుగుతుంది. సంతోషకరంగా సాగుతుందీ వారం. మనసును నియంత్రించుకోండి. ఎంచుకున్న రంగాలందు వృద్ధి. స్ర్తిలతో ప్రయాణాలు లాభిస్తాయి. వస్తు, వాహనాదులతో ఇబ్బంది లేకుండా చూసుకోండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

పనులందు నిర్లిప్తత పనికిరాదు. సమయానికి మీ వాళ్లు సాయపడతారు. కొన్ని విషయాలందు మీ వ్యవహారాలు గుర్తింపును తెస్తాయి. అనుకోని ప్రయాణాలున్నాయి. వృత్తి, ఉద్యోగాలందు అనుకున్నట్లు గుర్తింపు పొందుతారు. చేతివృత్తుల వారికి ఆనందం కలుగుతుంది. స్పెక్యులేషన్ ఫలప్రదం. విదేశీ ప్రయాణాలకై చేసే ప్రయత్నాలు మెరుగవుతాయి. ఉద్యోగ అవకాశాలు సఫలమవుతాయి. పెట్టుబడులు మిశ్రమం. ఆధ్యాత్మిక కార్యాలు ఊపందుకుంటాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

కన్యలకు శుభకాలం. వివాహ ప్రయత్నాలు అనుకోకుండా కలసి వస్తాయి. వస్తు, వస్త్రాల లబ్ధి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, సౌకర్య విషయాలందు విస్తరణ ఉంటుంది. పుణ్య కార్యాలలో పాల్గొంటారు. హితులకు మీ సలహా సంప్రదింపులు ఫలిస్తాయి. మీకు గుర్తింపును తెచ్చిపెడతాయి. ఆర్థిక ఒడిదుడుకులున్నా అంతిమ లాభాలుంటాయి. స్పెక్యులేషన్ ఫలప్రదం. అంతా శుభం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

ఆర్థిక తృప్తి. విజయ సోపానాలుంటాయి. మధ్యమధ్య ఎంచుకున్న రంగాలలో వృద్ధి. వ్యవహారాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. తెలివిగా వ్యవహరించాలి. మిత్రుల సహకారంతో అన్నింటా విజయం. అవసరానికి మించి శ్రమ పడకండి. కలహాల జోలికి వెళ్లవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. స్పెక్యులేషన్ సౌఖ్యప్రదం. ఉద్యోగ వృద్ధి. అవకాశాలు కలసి వస్తాయి. సంతోష కార్యాలందు మీ ప్రవర్తన సామాజిక విలువలకు అద్దం పడుతుంది.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

అదృష్ట, సహకారాలు అన్నింటా ఉంటాయి. కార్యసిద్ధి. ధైర్యంగా ముందుకు వెళ్తారు. అశ్రద్ధ పనికిరాదు. శ్రద్ధతో పనులు పూర్తి చేయండి. సమాజంలో గౌరవాన్ని, ప్రశంసలు అందుకుంటారు. స్ర్తిలు చేసే పనులు నైపుణ్యవంతమవుతాయి. స్పెక్యులేషన్ వివరణాత్మకంగా ఉంటుంది. దూర ప్రయాణాలుంటాయి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. హితుల రాక ప్రయోజనకారిగా మారుతుంది. తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒక విషయం కలవరపెడుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

పెద్దల మార్గదర్శకత్వంలో పనులు ప్రారంభించి మన్ననలు అందుకుంటారు. కుటుంబ సహకారం తీసుకోవాలి. అనుకున్న దానికంటె సత్ఫలితాలుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశలో వెళతాయి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆర్థిక విషయాల్లో ఖర్చు నియంత్రణ చేసుకుంటే మంచిది. ఆవేశ పడకండి. ఇంటికై చేసే ప్రయత్నాలు కొనసాగుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. శ్రద్ధ, మెళకువలు పాటించండి. అశ్రద్ధ, అనవసర ఆలోచనలు కూడదు. మీరు మీ హద్దుల్లోనే ఉండటం మంచిది. విమర్శలున్నప్పటికీ పట్టించుకోకుండా సమాధానాలు లౌక్యంగా చెప్పటం నేర్చుకోండి. హితుల వల్ల ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక విషయాలలో నైపుణ్యం మేలు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అనుకున్న, ఎంచుకున్న రంగాలు ఫలప్రదం.
కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

మీ మాటలు వినేవారిని ఆశ్చర్యపరుస్తాయి. విజ్ఞతతో మెలగాలి. వదిలివేసిన పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన కార్యాలు నెరవేరుతాయి. ఆదాయ వ్యయాలందు సంతృప్తి కానవస్తుంది. ఎంచుకున్న అన్ని రంగాలందు తృప్తి కలుగుతుంది. హితులు సాయపడతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. శాంతంగా వ్యవహరించండి. పెట్టుబడులు అనుకూలం. వార్తలు ఆలోచింపజేస్తాయి. ఆరోగ్యంకై సమయాన్ని కేటాయించండి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

మంచి పదవులు అందుకుంటారు. పైకం సర్దుబాటవుతుంది. అప్పులు ఇచ్చినట్లయితే తిప్పలు తప్పవు. హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వండి. ఎదుటి వారితో జాగ్రత్త. రియల్ ఎస్టేట్ రంగం అనుకూలం. ఒప్పందాలు ఆలోచింపజేస్తాయి. ముఖ్య వ్యవహారాలలో స్వల్ప మార్పులు. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది. అలవాట్లు ఇబ్బందికరంగా మారేట్టు ఉన్నాయి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855