ఎలావుందీ వారం?

ఎలా ఉందీ వారం? (సెప్టెంబర్ 24 నుండి 30 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
వివరణ, సవరణ, నైపుణ్యాలతో ఈ వారం కార్యసిద్ధి. బుద్ధి, వృద్ధికి పదును పెట్టండి. త్వరితగతిన పనులు చేసేటప్పుడు ఆలోచించటం మంచిది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార విషయాలు తృప్తిని అందిస్తాయి. విస్తరణలకు అన్నింటా అవకాశాలున్నాయి. సమయానికి పైకం సర్దుబాటవుతుంది. ఉద్యోగావకాశాలుంటాయి. విలువైనవి ఖరీదు చేస్తారు. స్పెక్యులేషన్ వైవిధ్యభరితం. అన్నింటా జయం. ఉద్యోగస్తులకు మంచి తరుణం. మీ సలహాలకై మీ వారు ఎదురుచూస్తున్నారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఆర్థిక సంతృప్తి. ఇతరుల సహాయ సహకారాలు వెంటవెంట అందనున్నాయి. వృత్తి, వ్యాపార, వ్యవహార, ఉద్యోగ రంగాలు గతం కంటె వృద్ధిలో ఉంటాయి. స్ర్తిలు, బంధువర్గంలో సంతోషం. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లండి. అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని పనులు లోగడ ఆగినవి తిరిగి పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవస్థ మెరుగవుతుంది. ఐటి, వృత్తి, వ్యాపార, ఇతర రంగాలు నిపుణతతో గుర్తింపును అందుకుంటారు. స్పెక్యులేషన్ ఊహించిన దానికంటె మెరుగవుతుంది. అనుకోని శుభాదులను ఒడిసి పట్టుకోవాలి. ఆర్థిక పుష్టి. విజయ ప్రాప్తి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

దంపతులు సామాజిక కార్యాల్లో పాలుపంచుకుంటారు. అనుకోని ముఖ్యమైన పనుల నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. పైకం సమయానుకూలంగా అందుతుంది. నైపుణ్య పెంపు దిశగా వర్తించండి. సాంఘిక కార్యకలాపాలలో గుర్తింపును, మన్ననలను పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందిని కలిగిస్తాయి. స్పెక్యులేషన్ జయప్రదం. మిత్రుల సాయం మరువరానిదని గుర్తిస్తారు. కొన్ని పనులు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

నిలకడపైనే జయం. ఆర్థిక వృద్ధి. కష్టమైన కార్యాలు నేర్పుతో పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ముందడుగు వేస్తారు. ధన సూచితాలు. వృత్తి, ఉద్యోగ, ఐటి, చిన్న వృత్తుల వారు అనుకోని ప్రగతిని చూస్తారు. దంపతులు నమ్మకంతో ఒకే మాటతో ఉండాలి. విదేశీ యత్నాలు, కోర్టు వ్యవహారాల పరిష్కారాలు ఒనగూడుతాయి. ప్రతికూల వాతావరణాన్ని నెమ్మదిగా పరిష్కరించుకుంటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ఆర్థిక లాభాలుంటాయి. అనుకున్నవి సాధిస్తారు. పరిశ్రమల వృద్ధికి మీ సూచనలు లాభిస్తాయి. వివాహ ప్రయత్నాలు, శుభకార్యాలు కలసి వస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. మీ నడవడిక, ఒడంబడికలు కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెడతాయి. ఉద్యోగ అవకాశాలు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. స్పెక్యులేషన్ మిశ్రమం. ఒక విషయం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. బంధువుల మాటలు ఇబ్బందిని కలిగిస్తాయి. వారాంతంలో శుభ ఘడియలున్నాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. నచ్చిన రంగంలో వృద్ధిని సాధిస్తారు. చెప్పేవారు ఎన్ని చెప్పినా మీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్లకండి. వృత్తి, వ్యాపార, వ్యవహార రంగాలు గతంలా ఉండకుండా గుర్తింపును అందుకుంటుంది. స్పెక్యులేషన్ మిశ్రమం. బకాయి పనులు పూర్తవుతాయి. ప్రయాణాలందు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త పాటించండి. విద్యార్థులకు మంచి తరుణం. విజయలబ్ధి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

విజయ ప్రాప్తితో ప్రోత్సాహం. పని ఒత్తిడితో అలసట చెందేట్లున్నారు. విశ్రాంతి అవసరం. ఆటంకాలున్నా మీ నైపుణ్యంతో కార్యాలు పూర్తి చేస్తారు. మిమ్మల్ని కలుస్తామనీ, సాయపడతామనీ అన్నవారు మాట తప్పుతారేమో చూసుకోండి. శ్రమానుకూలంగా అన్ని రంగాల వారు ప్రగతిని సాధిస్తారు. అనుకోని ప్రయాణాలుంటాయి. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. సంఘంలో పలుకుబడి పెరుగనుంది. స్పెక్యులేషన్‌లో మెళకువ అవసరం. వ్యవహార సౌఖ్యం.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

శుభ సమయం. నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. శుభకార్యాదులు కలసివస్తాయి. అన్నింటా ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విరోధాలు లేకుండా మెలగాలి. విద్యార్థులకు సదవకాశాలు. ఐటి, వృత్తి, వ్యాపార, ఇతర రంగాలు నిపుణతతో గుర్తింపును అందుకుంటారు. స్పెక్యులేషన్ ఊహించిన దానికంటె మెరుగవుతుంది. అనుకోని శుభాదులను ఒడిసి పట్టుకోవాలి. ఆర్థిక పుష్టి. విజయ ప్రాప్తి. విదేశీ యత్నాలు, కోర్టు వ్యవహారాల పరిష్కారాలు ఒనగూడుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

కోపతాపాలు మీ వ్యవహారాలలో రాకుండా చూసుకోండి. గృహ నిర్మాణ యత్నాలు ఇతరుల సాయంతో ముందుకు వెళతాయి. ఆందోళన పడకండి. శుభకార్యాలలో మీ ప్రమేయం ఉంటుంది. అన్నీ వృద్ధి బాటన ఉంటాయి. మీ శ్రీమతి/ శ్రీవారు నుంచి బహుమతులు అందుకుంటారు. బాధ్యతలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు మంచి తరుణం. మీ సలహాలకై మీ వారు ఎదురుచూస్తున్నారు. విజయసిద్ధి. మనోధైర్యం అవసరం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ఆర్థిక విషయాలు ఆలోచింపజేస్తాయి. శుభకార్యాలు కలసి వస్తాయి. సమాజంలో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మలచుకోండి. పుణ్య కార్యాలకై చేసే ప్రయత్నాలు కలసి వస్తాయి. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. రావలసిన బకాయిలు ఆలస్యంగానైనా అందుతాయి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

గౌరవ మన్ననలు అందుకుంటారు. కోపతాపాలొద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్య విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. పెట్టుబడులు, రాబడి సమానతలు పాటించండి. కుటుంబంలో ముఖ్యుల ఆరోగ్యం మిమ్మల్ని కలవరపరుస్తుంది. హితులు సాయపడతారు. శత్రువులపై విజయం. పైకం వ్యవహారాలు అనుకూలం. లౌక్యంతో మెలగండి. వ్యాపారాలు వృద్ధి బాటలో ఉంటాయి. విజయాలు శ్రమానుకూలం.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

అనుకూల వాతావరణం. శాంతికై ఆలోచించండి. విజయసిద్ధి. సౌఖ్య ప్రాప్తి. ఆదాయ వృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిస్తారు. అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు సంతోషపరుస్తాయి. తత్తరపాటుతనం విడనాడండి. స్పెక్యులేషన్ మిశ్రమం. గృహ మార్పులుంటాయి. ఆర్థిక తృప్తి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855