ఎలావుందీ వారం?

ఎలా ఉందీ వారం? ( అక్టోబర్ 22 నుండి 28 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆదాయ వ్యయాలు అంచనాలు మించుతాయి. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. పరిశీలనతో స్వీయ నిర్ణయాలు శ్రేయస్కరం. కుటుంబ సభ్యుల విషయాలను పట్టించుకోవాలి. బాధ్యతాయుతంగా నడచుకోండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాదులు లాభదాయకం. ప్రయాణాదులు అనుకూలిస్తాయి. ఇతరుల విషయాల్లో అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి. ప్రణాళికాయుక్తంగా పనులు పూర్తవుతాయి. అవకాశాలను వినియోగించుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. సాంకేతిక పోటీ పరీక్షలందు అనుకూల వాతావరణం.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఆర్థిక స్థితి పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోండి. మనసుకు అనుగుణంగా వ్యవహరించండి. నైపుణ్యాన్ని ప్రదర్శించండి. ఇబ్బంది పెట్టేవారున్నా మీరు మీ పద్ధతిలో ముందుకు వెళతారు. ఆరోగ్యం పట్ల, కుటుంబ సభ్యుల విషయాల్లో మెళకువలు పాటించండి. మీరు ఎంచుకున్న వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార రంగాలు వృద్ధి బాటన ఉంటాయి. స్పెక్యులేషన్ మిశ్రమం. పెట్టుబడులకు అడ్డంకులు రాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. స్ర్తిలకు ప్రయాణాలు ఆలోచింపజేస్తాయి. అధికారులతో పరిచయాలు మేలును సూచిస్తుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

అనురాగ వాత్సల్యాలుంటాయి. సన్నిహితులు తలలో నాలుకగా ఉంటారు. డబ్బుకి ఇబ్బందులున్నా పరిష్కారమవుతాయి. ఎంచుకున్న రంగాలలో వృద్ధి కానవస్తోంది. అన్ని పనులలో అభివృద్ధి. నిరుద్యోగులకు శ్రమానుకూల ఫలితాలు. విలువైన వస్తువులతో ప్రయాణాదులందు మెళకువ పాటించండి. ఆందోళన పడకండి. వాహన ప్రయాణాలలో వేగ నియంత్రణ మంచిది. వాహన మార్పులకు వీలుంది. నిరాశను దరికి రానీయకండి. అన్నింటా కలసి వస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

శ్రమానుకూలంగా ఫలాలు సంక్రమిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సాంకేతిక రంగాలందు వృద్ధి. విలువైన వస్తువులతో ప్రయాణాదులందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. బుద్ధిబలంతో పనులు పూర్తి చేస్తారు. స్పెక్యులేషన్ విస్తరిస్తుంది. స్వల్పంగా జయానుకూలం. నేర్పు, ఓర్పుతో కొన్ని కార్యాలు నిర్వర్తిస్తారు. ఆధ్యాత్మిక వాతావరణం అనుకూలం. వాతావరణానుకూలంగా మెలగండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

కొన్ని పనులు మరల మరల చేయవలసి వస్తుంది. అన్నింటా సమీక్షలు, పరీక్షలు, ఉపేక్షలు అవసరమైతేనే, ఆలోచించి వ్యవహరించండి. అవకాశాలు కలసి వస్తాయి. మానసిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలి. స్పెక్యులేషన్ ఫలప్రదం. విదేశీ యత్నాలు ఆలస్యమైనా అనుకూలిస్తాయి. పరామర్శలకు వెళ్లవలసి వస్తుంది. ఈర్ష్యా ఘర్షణలు వద్దు. ఆలోచనలను వేగవంతం చేయండి. జీవితానికి మంచి బాటలు వేయగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఆలోచింపజేస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

ముఖ్యమైన పనులు శుభాల దిశగా ముందంజ వేస్తాయి. అన్నింటా సంతృప్తి. మీరు చేసే పనులందు సంతృప్తి కానవస్తుంది. హితులు, సన్నిహితులకు మంచి సలహాలనిస్తారు. ఒక వార్త మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. వ్యవహారాలలో తలనొప్పులు రాకుండా లేకుండా చూసుకోండి. అనుకున్నవి ఆలస్యమయినా పూర్తవుతాయి. స్పెక్యులేషన్ మిశ్రమం. స్ర్తిలు నిర్వహించే కార్యక్రమాలు గుర్తింపును తెచ్చిపెడతాయి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

అర్థ లాభాలు. అనుకున్నవి నిర్ణయాత్మకంగా పూర్తి చేస్తారు. మిత్రులు సాయపడతారు. వదంతులు నమ్మకండి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. విలువైనవి ఆలస్యంగానైనా అందుతాయి. కొంతమంది మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. మెళకువగా ఉండండి. అధికారుల అండదండలుంటాయి. స్పెక్యులేషన్ ఫలప్రదం. దైవధ్యానం శోభిస్తుంది. ఆర్థిక లాభం. పోటీ పరీక్షలందు ఉత్తీర్ణత. ఉద్యోగ రంగాలలో వృద్ధి కానవస్తుంది. ముఖ్యులకు మీ సలహాలు ఉపకరిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ఆత్మబలంతో యత్నిస్తే ఆర్థిక వృద్ధి. అన్ని లావాదేవీలు సమీక్షించుకోండి. అన్నింటి అప్రమత్తత మేలు. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలందు మెళకువలు పాటిస్తే అన్నీ శుభాలే. స్పెక్యులేషన్ మిశ్రమం. దీర్ఘకాలిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. చేసే పనులపై పట్టు సాధించండి. సన్నిహితుల సలహాలకు మీ ఆలోచనలను జోడించి కార్యసిద్ధికి కృషి చేయండి. అనుకోని అతిథులు వస్తారు. అధిక శ్రమ అనర్థదాయకం. ఇతరుల విషయాల్లో ఆసక్తి అనవసరం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

అన్నింటా శుభం జరుగుతుంది. పరిచయాలు విస్తరిస్తాయి. ఆహార వ్యవహారాలలో మెళకువ పాటించండి. జాగ్రత్త వహించండి. కంటి, పంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. మీరు ఎంచుకున్న రంగాలు శ్రమానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక లాభాలు. శత్రు విజయం. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. ఉత్సాహంతో నిర్ణయాలు తీసుకోండి. స్ర్తిలు చేసే వ్యవహారాలు ఫలవంతం. ప్రయాణాలందు ఏకాగ్రత, జాగ్రత్త అవసరం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
ఆదాయ వ్యయాలు తృప్తినిస్తాయి. లోగడ ఖర్చులే మరల మరల ఉంటాయి. కృషికి తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలసి మంచి కార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగావకాశాలు. ఎంచుకున్న రంగాలలో వృద్ధి కాన వస్తుంది. స్పెక్యులేషన్ విస్తరిస్తుంది. నిర్ణయాలు అవకాశాన్నిబట్టి మార్చుకోవలసి వస్తుంది. పెద్దల అండదండలుంటాయి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

శ్రమానుకూలంగా ఆర్థిక సౌలభ్యం. అనుకోని విధంగా హితులు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. మొహమాటాలకు పోకండి. మీరు చేయగలిగితేనే చేయండి. ఇబ్బందికరంగా ఉంటే నిర్మొహమాటంగా వదిలిపెట్టండి. చేసే పనిపై అవగాహన పెంచుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ఉద్యోగులకు ప్రగతి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు నైపుణ్య దిశలో ఉంటాయి. రాబడిపైనే దిగుబడి. పెట్టుబడి పాఠాలు నేర్చుకోవాలి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

కష్ట ఫలాలు అందుతాయి. అనుకోని ఉన్నత పదవులు అందుకుంటారు. పైకం తృప్తినిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యాలు నిశ్చయమవుతాయి. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. పరామర్శలకు వెళ్లవలసి వస్తుంది. దొంగతనాలకు అవకాశం రాకుండా చూసుకోండి. వ్యవహారాలందు నేర్పు, ఓర్పు చూపాలి. పెట్టుబడులు తృప్తినిస్తాయి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855