ఎలావుందీ వారం?

ఎలా ఉందీ వారం? ( డిసెంబర్ 3 నుండి 9 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. కార్యసిద్ధి. విజయప్రాప్తి. అనుకున్నవి ఆలస్యంగానైనా పూర్తవుతాయి. కుటుంబ సమస్యలను పరిశీలనతో పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపార, వ్యవహార రంగంలోని వారు పోటీని ఎదుర్కొనవలసి వస్తుంది. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. పిల్లలతో సంయమనం పాటించాలి. అన్నింటా లౌక్యంగా వ్యవహరించండి. ప్రతి దానికీ ఎదురు చూడాల్సి వస్తుంది. స్పెక్యులేషన్‌లో తొందరపాటు పనికిరాదు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
ఆర్థిక తృప్తి. వ్యయ నియంత్రణ చేయటం మంచిది. ఎంచుకున్న రంగాలు ఆలోచింపజేస్తాయి. ప్రయాణాలందు అప్రమత్తత అవసరం. మానసిక ఉత్సాహంతో పనులు నిర్వర్తించండి. ముఖ్యమైన కార్యాలలో ఇతరుల ప్రమేయం లేకుండా చూసుకోండి. ప్రయాణాదులందు మెళకువ అవసరం. స్పెక్యులేషన్ మిశ్రమం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. శుభ కార్యాలు మీ నేతృత్వంలో జరుగనున్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మేలు. అనుకోకుండా లాభాలుంటాయి. వ్యవసాయ రంగం వారు, రియల్ ఎస్టేట్ అనుకూలం.
మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
సంతోషకరమైన సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. నూతన సమస్యలు లేకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. స్ర్తిలకు యత్నాలు సఫలమవుతాయ. శక్తికి మించి అప్పు చేయవలసి వస్తుంది. ప్రయాణాదులందు జాగ్రత్తలు పాటించండి. పెట్టుబడులకు వనరులు సమకూర్చుకోండి. పెట్టుబడులు రాబడికి అనుకూలం. ఎదుటివారిని అంచనా వేయడం మరచిపోకండి. సన్నిహితులు, విద్య, వైద్య, వ్యవహార రంగాలు అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. విందులు వినోదాలలో పాల్గొంటారు.
కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
ఆర్థిక మార్గాలు శ్రమకు తగ్గ ఫలితాలనిస్తాయి. ఇతరులను అధికంగా విశ్వసించకండి. నిర్ణయాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయండి. సామాజిక కార్యాలందు చురుకుగా పాల్గొంటారు. వృత్తి, నైపుణ్య వృద్ధి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అన్నింటా శుభకరం. శ్రేయోదాయకం. ప్రయత్నాలు వేగవంతం చేయండి. అధికారుల అండదండలుంటాయి. న్యాయ వ్యవహారాలు ఒక కొలిక్కి రానున్నాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. ఎంచుకున్న రంగాలు ఫలప్రదం. అనుకోని సంఘటనలు పునరావృతమవుతాయి. అనుకోని వ్యయాలున్నాయి. ఒక పని వెంట వెంటనే కాదు.. పదేపదే ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆశయ సిద్ధి. పట్టుదలతో ముందుకు సాగండి. ఎవరి సహాయ సహకారాలు లేకుండానే పనులు పూర్తి చేస్తారు. సుఖ సంతోషాలుంటాయి. పనులు పూర్తి చేస్తారు. ఆవేశాన్ని నియంత్రించుకోవాలి. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది. నమ్మకం గెలిపిస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
పడిన శ్రమ వృథా కాదు. ఆర్థికానుకూలత ఉంది. ప్రణాళికలు, కొత్త కార్యాలకు ప్రణాళికలు వేయాలి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ప్రయత్నానుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వాటిలో జాగ్రత్తలు అవశ్యం. విలువైన వాటితో ప్రయాణాలు ఇబ్బందికరం. కుటుంబ సభ్యులు సాయపడతారు. వచ్చిన అవకాశాలను సానుకూల పరచుకోండి.
తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
గతంకంటె మంచి సమయం. ఆర్థిక లాభాలు ఉంటాయి. శక్తికి మించిన ఖర్చులుంటాయి. ఇబ్బందులున్నా ఆలోచనతో సరిదిద్దుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు సానుకూలం. శ్రమానుకూల ఫలితాలు అందుకుంటారు. హితుల సలహాలు ఉపకరిస్తాయి. బద్ధకాన్ని విడనాడండి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. కోపతాపాలకు తావివ్వవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. ఇతరులను అధికంగా విశ్వసించకండి. నిర్ణయాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయండి. సామాజిక కార్యాలందు చురుకుగా పాల్గొంటారు.
వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
క్రమానుకూలతలు ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. మనోబలం అవశ్యం. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు మంచి ఫలాలను అందిస్తాయి. స్పెక్యులేషన్ స్వల్పం. ధన అవసరాలు అంచనాలను మించుతాయి. ఆగిన పనులు కొన్ని పూర్తవుతాయి. అనుకోని ప్రయాణాలున్నాయి. కొన్ని విషయాల్లో అనుకూల ఫలాలు అందుకుంటారు. బుద్ధిబలం ప్రదర్శించండి. దూరపు బంధువులు వస్తారు. విలువైన వాటితో జాగ్రత్త. శుభకాలం కలిసి వస్తుంది. అనర్థాలు, నష్టాలకు దూరంగా ఉండండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
కాలానుగుణంగా సమస్యలను పరిష్కరించుకొంటారు. ఫలితాలకై ఎదురుచూడకుండా పనులు నిర్వర్తించండి. అధికారులతో మాటలు అనుకూలిస్తాయి. కలహాలకు దూరంగా ఉండటం మేలు. సంతోష సమయం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. రుణ సమస్యలను పరిష్కరించుకొంటారు. విజయపరమైన వార్తలు వింటారు. ధన ధాన్యా లాభాలుంటాయి. ముఖ్య వ్యక్తులకు మీ సహాయాలు గుర్తింపు నిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
విజయాలున్నాయి. కార్యభారం అధికంగా ఉండేట్టు ఉంది. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఒక విషయం అనుకూలంగా మారనుంది. అనుకోని శుభాలను అందుకుంటారు. సంతోషంగా ఉండాలనుకొన్నప్పటికీ సమస్యలను వేధిస్తుంటాయి. సౌమ్యంగా మాట్లాడటం నేర్చుకోండి. సర్దుకుపోయే మనస్తత్వం మేలు చేస్తుంది. కొన్ని అప్పులు తీర్చగలుగుతారు.
కుంభం (ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అనుకున్నవి పూర్తి చేస్తారు. ఏ పని చేయదలచినా మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలందు అనుకూలమైన మార్పులుంటాయి. ధన ధాన్య లాభాలుంటాయి. హితులతో సంతోషాలను పంచుకొంటారు. వదంతులు నమ్మకండి. మీకు చేతికందినవి నిర్ణయాత్మకంగా మలచుకోండి. స్పెక్యులేషన్ స్వల్ప లాభాలనిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక ప్రగతికి ప్రణాళికలు వేయవలసి వస్తుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి. కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయించండి. వారి పనులలో లోపం రానీయకండి. స్పెక్యులేషన్ సమస్యాత్మకంగా ఉంటుందేమో. ప్రయాణాదులందు జాగ్రత్త వహించాలి. ముందడుగు వేయండి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855