రాష్ట్రీయం

విలీనమే.. ఫిరాయింపు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్‌కు బాబు చేసిందేమిటి? మీడియాతో ఎర్రబెల్లి
హైదరాబాద్, మార్చి 12: టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో టిడిఎల్‌పి విలీనమైందే తప్ప, ఫిరాయింపు కాదని ఇటీవల టిఆర్‌ఎస్‌లో చేరిన టిటిడిపి మాజీ నేత ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఆయన శనివారం ముచ్చటిస్తూ తన మాజీ బాస్, టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి సిఎం చంద్రబాబునాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్టీఆర్‌కు చంద్రబాబునాయుడు చేసిన దానితో పోలిస్తే తాము చేసింది చాలా తక్కువేనని అన్నారు. తాము కేవలం టిడిఎల్పీని తెరాసఎల్‌పిలో విలీనం చేసామే తప్ప పార్టీ ఫిరాయింపు కాదని వివరణ ఇచ్చారు. ఆనాడు ఎన్టీఆర్‌ను గద్దె దించి చంద్రబాబు సిఎం కావడం కోసం అందరి మద్దతు తీసుకున్నారని గుర్తు చేశారు. అధికార పార్టీ టిఆర్‌ఎస్‌లో చేరినట్లా, లేక విలీనమైనట్లా అన్న అంశాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి వివరణ ఇవ్వాలే తప్ప తాము కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.