క్రీస్తు ఏసు గీతావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఎస్‌ఆర్ ఏసుక్రీస్తు పాత్రలో సంగాల దయానంద క్రియేషన్స్ పతాకంపై చండ్ర పార్వతమ్మ నిర్మించిన చిత్రం క్రీస్తుఏసు. ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వివరాలు తెలియజేస్తూ, ఇదొక గొప్ప చారిత్రాత్మక చిత్రమని, భారతదేశ చలనచిత్ర రంగంలో మైలురాయిగా నిలిచిపోతుందని, పరిశుద్ధ బైబిల్ ఆధారంగా స్క్రీన్‌ప్లే, పాటలు రూపొందించామని, క్రీస్తు బోధనలే ప్రధాన ఇతివృత్తంగా సాగుతుందని అన్నారు. ఈ చిత్రాన్ని చూసి ప్రతి క్రీస్త్భుక్తుడు అనందపడతాడని, క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. మాజీమంత్రి మారప్ప మాట్లాడుతూ, కుమార్‌రాజా తనకు మంచి మిత్రుడని, ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని అనుకుంటున్నానన్నారు. ఇందులో తానొక కీలకపాత్రలో కన్పిస్తానని, తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరిస్తుందన్నారు. కమరమ్మ మాట్లాడుతూ, ఈ రోజు ఈ పాటల కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా వుందని, పాటలు బాగున్నాయన్నారు. డిసెంబర్ 25న ప్రపంచమంతా జరుపుకునే క్రిస్మస్ పండుగరోజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:సంగాల, సమర్పణ:చండ్ర చంద్రశేఖర్, నిర్మాత:చండ్ర పార్వతమ్మ, దర్శకత్వం:డా ఎస్.ఆర్.కుమార్ రాజా.