జాతీయ వార్తలు

ఘనంగా యోగా దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధానితో కలిసి 55 వేల మంది ఔత్సాహికులు యోగాఆసనాలు వేశారు. అలాగే వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన యోగా వేడుకల్లో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఆయుష్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 5 వేల చోట్ల యోగా కార్యక్రమాలు చేపట్టారు. దేశరాజధాని ఢిల్లీలో రాజ్‌పథ్‌ సహా 8 ప్రాంతాల్లో యోగా వేడుకలు నిర్వహించారు. ఎర్రకోట వద్ద బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. అలాగే 150 దేశాల్లో భారత దౌత్యాధికారుల పర్యవేక్షణలో యోగా వేడుకలు నిర్వహించారు. మహారాష్ట్ర గవర్నర్‌ సీ. విద్యాసాగర్‌ రావు నేతృత్వంలో మెరినా బీచ్‌లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ పాల్గొన్నారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వసుంధర రాజేతో పాటు యోగా గురువు బాబా రాందేవ్‌, ఆచార్య బాలక్రిష్ణ కూడా పాల్గొన్నారు.
మంచు ఎడారిలో...
లడఖ్‌ ఇండో - టిబెటన్‌ బార్డర్‌ పోలీసు అధికారులు 18 వేల అడుగుల ఎత్తున ఉన్న మంచు ఎడారిలో సూర్య నమస్కారాలు చేసారు.