జాతీయ వార్తలు

అయోధ్యలో ఆదిత్యనాథ్ పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 31: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం అయోధ్యలోని రామమందిరంలో పూజలు నిర్వహించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బిజెపి సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతిలపై చార్జిషీట్ దాఖలైన మర్నాడే అయోధ్యంలో ఆయన పర్యటించడం గమనార్హం. వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటైన రామ మందిరంలో యోగి ఆదిత్యనాథ్ పూజలు చేశారు. బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో అయోధ్యలో రామమందిర నిర్మాణం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరయు నదిలో పూజలు అర్పించి హనుమాన్‌గ్రహి ఆలయాన్ని సందర్శించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని ఆపే శక్తి భూమిపై ఎవరికీ లేదని బిజెపి ఎంపీ సాక్షి మహారాజ్ మంగళవారం లక్నో లో ప్రకటించడం, మర్నాడే యోగి ఆదిత్యనాథ్ పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. యోగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి అయోధ్యకు వచ్చారు. అయితే సిఎం పర్యటన వెనక ఎలాంటి రాజకీయాలు లేవని బిజెపి వర్గాలు పేర్కొన్నాయి. కోర్టు కేసుకు ఆదిత్యనాథ్ పర్యటనకు ఎలాంటి సం బంధం లేదని వారన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ జయంతి కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి పర్యటన ఖరారైందని బిజెపి వర్గాలు పేర్కొన్నాయి.
చిత్రం: సరయునదికి పూజలు చేస్తున్న
యూపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్