జాతీయ వార్తలు

మీ వెంటే మేముంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దళిత పారిశ్రామికవేత్తలకు ప్రధాని భరోసా
ఉపాధి ఇచ్చే వారిని తయారు చేద్దాం
పారిశ్రామికీకరణ వల్లే దళితులకు మేలు
గ్యారంటీ లేకుండా రుణాలిస్తామని హామీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి ఇచ్చే వారిని తయారు చేయాలనుకుంటున్నది తప్ప ఉపాధి అడిగే వారిని కాదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములను చేయడం ఆధారంగా దేశంలోని ఎస్‌సి, ఎస్‌టి, వెనుకబడిన వర్గాల సాధికారిత కోసం పని చేస్తోందని తెలిపారు. మంగళవారం విజ్ఞాన్ భవన్‌లో భారత దళిత వాణిజ్య సమాఖ్య జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ మోదీ ఈ విషయం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఇది అత్యంత ముఖ్యమైన అంశమని ఆయన స్పష్టం చేశారు. ఎస్‌సి, ఎస్‌టి పారిశ్రామికవేత్తల అభివృద్ధికి తమ ప్రభుత్వం అన్నివిధాల తోడ్పడుతుందని మోదీ హామీ ఇచ్చారు. కేంద్రంలో మీ మనిషి ఉన్నాడనే విషయం మరిచిపోరాదని ఆయన దళిత పారిశ్రామికవేత్తలకు సూచించారు. ఇది మీ ప్రభుత్వం, మీ వెంట ఉంటుందని ప్రధాని వారికి భరోసా ఇచ్చారు. దళితుల ఆత్మ, చిహ్నం బాబాసాహెబ్ అంబేద్కర్‌ను మనమంతా రాజ్యాంగ నిర్మాతగానే గుర్తిస్తాముకానీ ఆయన మంచి ఆర్థిక శాత్రవేత్త అనేది చాలా తక్కువమందికి తెలుసునని మోదీ చెప్పారు. పారిశ్రామికీకరణ దళిత సోదరీ, సోదరీమణులకు అత్యధిక ప్రయోజనం కలిగిస్తుందని అంబేద్కర్ ఎప్పుడో చెప్పారన్నారు. దేశంలోని వెనుకబడిన వర్గాల పారిశ్రామిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేసిందని మోదీ చెప్పారు. దళిత పారిశ్రామికవేత్తలు నిలబడి తనను గౌరవించటాన్ని అంబేద్కర్‌కు సమర్పిస్తున్నానని మోదీ ప్రకటించారు. దళిత పారిశ్రామికవేత్తలు కేవలం అధికారం కోసమే కాకుండా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. దళితులు బ్యాంకులనుండి రుణాలు తీసుకోవాలంటే అష్టకష్టాలు పడవలసి వస్తోందని, ఈ స్థితి మారాలని మోదీ స్పష్టం చేశారు. కొన్ని వర్గాల వారు ఎలాంటి కష్టాలు పడకుండానే పైకి వచ్చారు కానీ దళితులు అడుగడుగునా కష్టపడి పైకి వచ్చారని, ఈ కష్టాలేమిటనేది తనకు బాగా తెలుసునని ప్రధాని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు కర్నాటకకు చెందిన దళిత పారిశ్రామికవేత్త చేస్తున్న కృషిని మోదీ ప్రశంసించారు. జీవితంలో నిరాశ ఎదురైనప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తుందని, ఇలా ఆలోచించే వారు ఆత్మహత్య చేసుకునే ముందు ఒకసారి కల్పనా సరోజ్‌కు టెలిఫోన్ చేసి మాట్లాడాలని ఆయన సూచించారు. నిరాశలో కూడా జీవించాలనే ఆశ కల్పించిన వ్యక్తి పారిశ్రామికవేత్త కల్పనా సరోజ్ అని మోదీ ప్రశంసించారు. బ్రౌన్‌ఫీల్డ్‌తో పాటు గ్రీన్‌ఫీల్డ్ రంగానికి కూడా రుణాలు మంజూరు చేయటంతో ఉత్సాహం చూపించాలని ప్రధాని బ్యాంకులకు సూచించారు. దాదాపు ఎనభై లక్షల మందికి ఒక్క రూపాయి గ్యారంటీ లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించినట్లు ఆయన వెల్లడించారు. వీరు దాదాపు పద్నాలుగు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. ఆధునిక పారిశ్రామికవాడలో మూడు వందల మందికి ఉపాధి కల్పించే వారికి రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు పరుగులు తీస్తాయి కానీ ఇలా వేలాది మందికి ఉపాధి కల్పించే చిన్న వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవటం విచారకరమన్నారు. నరేంద్ర మోదీ మొదట దళిత పారిశ్రామికవేత్తలకు వ్యాపార సమర్థత అవార్డులను బహూకరించారు.
కాగా, గత సంవత్సరం లక్షా యాభై వేల మంది దళిత యువకులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇప్పించినట్లు సదస్సులో పాల్గొన్న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి తావర్‌చంద్ గెహ్లోట్ తెలిపారు. పాకీపని వారికి పునరావాసం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. వీరికి ఆర్థిక సహాయం చేయటం ద్వారా పునరావాసం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. (చిత్రం) దళిత సమాఖ్య సదస్సులో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ప్రధాని మోదీ