తెలంగాణ

లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలి: అన్నాహజారే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: యువత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని ప్రముఖ సామాజిక నేత అన్నాహజారే పిలుపునిచ్చారు. మనల్ని సేవ చేసేందుకు ఆ భగవంతుడు పంపాడని గుర్తెరగాలని సూచించారు. హెచ్‌ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన సదస్సు జరిగింది. ఈ సదస్సును అన్నాహజారే, ఎంపీ కవిత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సదస్సుకు 135 దేశాల నుంచి యువజనులు హాజరయ్యారు. జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా జిజ్ఞాసతో ముందుకు సాగాలని అన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, సమస్యలన్నింటినీ మనం సృష్టించుకున్నవేనని, ఈ సదస్సులో కొన్నింటికైనా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.