రాష్ట్రీయం

దేవినేనిని బర్తరఫ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును బర్తరఫ్ చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సాగునీటి ప్రాజెక్టుల శాఖలో భారీ అవినీతి జరుగుతోందని, ఈ అవినీతిని నిరోధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నమ్మిన బంటు, టిడిపి ఎంపి సిఎం రమేష్ సాక్షాత్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారని వైకాపా గుర్తుచేసింది. వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం శనివారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ అవినీతికి కేంద్ర బిందువుగా తయారైన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేవినేని ఖరారు చేసిన కాంట్రాక్టు సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరారు. ప్రజా ధనం భారీ ఎత్తున దుర్వినియోగమవుతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలన్నారు. కర్నూలు జిల్లా ఔక్ రిజర్వాయర్ నిర్మాణం అంచనా వ్యయాన్ని రూ.12 కోట్ల నుంచి రూ.110 కోట్లకు పెంచారన్నారు. మార్గదర్శకాలకు విరుద్ధంగా రూ.44 కోట్లను కాంట్రాక్టర్లకు విడుదల చేశారన్నారు. ఈ అంశంపైన టిడిపి ఎంపి రమేష్ ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు. అలాగే నిజాయితీతో పనిచేస్తున్న అధికారులను ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేసి వేధిస్తున్నారన్నారు.
నేడు వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం
వైకాపా పార్టమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో జరుగుతుంది. ఈ నెల 24వ తేదీ నుంచి లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీలతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోక్‌సభలో ప్రజలకు సంబంధించి వివిధ అంశాలను ప్రస్తావించే విషయమై చర్చించనున్నారు.