ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 3 December 2015
విశాఖపట్నం : నిత్యవసర ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. పోలీసులు వారిని అడ్డుకొని జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. అయినప్పటికీ.. కలక్టరేట్ వద్దకు చేరుకున్న మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్‌లతో సహా 400 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.