అనంతపురం

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఓబుళదేవరచెరువు, డిసెంబర్ 27: ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి సత్వరమే పరిహారం పంపిణీ చేపట్టాలని వైకాపా అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. అంతేగాక రబీకి ఉచితంగా ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. ఆదివారం ఆయన ఇడుపులపాయ నుంచి బెంగళూరు వెళ్తూ మార్గమధ్యలో మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి నందు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తుఫాన్ కారణంగా జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలోని మండలాలైన అమడగూరు, నల్లమాడ, ఓబుళదేవరచెరువు, కదిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందేనన్నారు. వేరుశెనగ సాగు వల్ల రైతాంతం నష్టపోవడమే గాని ఇంతవరకు లాభ పడింది లేదనే విషయం అందరికి తెలిసిందేనన్నారు. కావున రైతాంగాన్ని ఆదుకోవాలంటే వెంటనే ఉచితంగా విత్తనాలు, మందులు పంపిణీ చేయాలన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పనుల విషయంలో అధికార పార్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ పూర్తిగా పక్షపాత ధోరణి అవలంభించడం జరుగుతోందన్నారు. ముఖ్యంగా గృహ నిర్మాణం, పింఛన్లు, రేషన్ కార్డులు పంపిణీ అంతా కూడా జన్మభూమి కమిటీల పేరుతో తమ వర్గం వారికే ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ విషయంలో వైకాపా తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేయడం జరుగుతోందన్నారు. అంతేగాక పార్టీ తరుపున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి కళ్లు తెరిపించడం జరుగుతుందన్నారు.