యువ

స్లేట్ భలే స్మార్ట్! ఏం తినాలో చెబుతుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహారం తీసుకుంటున్నప్పుడు ఎంత తింటున్నామో తెలీకుండా తినేసేవారే ఎక్కువ. ఆనక ఆ కేలరీలు కరిగించేందుకు జిమ్ బాట పడతారు. ఎందుకొచ్చిన ప్రయాస? తినేటప్పుడే ఎన్ని కేలరీలు తీసుకుంటున్నామో తెలిస్తే బాగుంటుంది కదా! ఇలా భావించేవారికోసం మార్కెట్లోకి వచ్చింది- స్మార్ట్ స్లేట్. ఇదో పోర్టబుల్ న్యూట్రిషన్ స్మార్ట్ స్కేల్. దీనిపై మనం తినబోయే ఆహార పదార్ధాలనుంచితే వాటిలో ఎన్ని కేలరీలున్నాయి, ఎన్ని మాక్రో న్యూట్రియెంట్లు ఉన్నాయి వంటి వివరాలను క్షణంలో కళ్ళకు కడుతుంది. దానినిబట్టి ఎంత తినాలో, ఎందులో ఎక్కువ కాలరీలు ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుందిగా! అన్నట్టు స్లేట్‌ను ఉపయోగించి ప్యాకేజ్డ్ ఫుడ్‌లో కేలరీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ప్యాక్ మీద ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు...అందులో ఉన్న కేలరీలు, పోషక పదార్ధాల వివరాలను స్లేట్ ఇట్టే చెప్పేస్తుంది. స్లేట్‌ను మీ స్మార్ట్ ఫోన్‌తో అనుసంధానించుకునే వీలు కూడా ఉంది.
*