యువ

అవార్డుల అమ్మాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌కు చెందిన ఈ అమ్మాయి విజయాలను తన కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకుంది. త్రీడి టెక్నాలజీని ఔపోసన పట్టి, రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేసింది. ముప్ఫయి ఏళ్లయినా దాటకముందే అనేక అవార్డుల్ని తన ఖాతాలో వేసుకుంది. తన స్నేహితుడు హసన్ అలీ ఖాన్‌తో కలసి ఐదేళ్ల కిందట ‘మెర్షియస్ సాఫ్ట్‌వేర్’ పేరిట వర్చువల్ రియాలిటీ కంపెనీ నెలకొల్పిన వైశాలి, అనతికాలంలోనే ఈ రంగంలో తనదైన ముద్ర వేసింది. నాలుగేళ్ల కిందటే ‘అగ్‌మెంటెడ్ రియాలిటీ’ రంగంలో బెస్ట్ స్టార్టప్ అవార్డును కైవసం చేసుకున్న వైశాలి, తాజాగా ‘ఓగ్ ఇండియా’ పత్రిక ప్రశంసలందుకుంది. టెక్నాలజీ ఆధారంగా రియాల్టీ రంగానికి ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన ప్రముఖ మ్యాగజైన్ ‘ఓగ్ ఇండియా’ భావి భారత నిర్మాతలను పరిచయం చేసే ‘ట్రైబ్స్ ఆఫ్ కూల్’ శీర్షికకు వైశాలిని కూడా ఎంపిక చేసింది. కళలు, సాంస్కృతిక రంగాలకే పరిమితం కాకుండా టెక్నాలజీకి కూడా ఓగ్ ఇండియా పెద్దపీట వేయడం హర్షదాయకమంటున్న వైశాలి, పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటుంది.
రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఉపయోగపడే ‘రియల్‌సిమ్’ను రూపొందించడం ద్వారా వైశాలి ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకట్టుకుంది. కొనుగోలుదారు తన ఇంటిని ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నాడో ముందుగానే కంప్యూటర్ తెరపై ఆవిష్కరించే సాధనమే రియల్‌సిమ్. తాను ఎలాంటి ఇల్లు కావాలనుకుంటున్నాడో, అది ఎలా ఉండాలో ఈ రియల్ సిమ్ కళ్లకు కడుతుంది. కావాలనుకుంటే ఇందులోనే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. దీనివల్ల టైమ్, మనీ సేవ్ అవుతాయంటుంది వైశాలి. రియల్‌సిమ్‌కు ఇటీవల ఎఫ్‌ఎమ్‌డబ్ల్యు కనెక్ట్ అవార్డు కూడా లభించింది.
కంపెనీ పెట్టగానే ఆఫర్లు వెల్లువెత్తలేదని, ఆలోచనలను ఆచరణలోకి పెడుతూ ఒకదానివెంట ఒకటిగా ఆర్డర్లు చేజిక్కించుకున్నానని చెబుతున్న వైశాలి, ముందుగా ఓ స్నేహితురాలి ఇంట్లోని ఓ చిన్న గదిలో ఆఫీస్ ప్రారంభించింది. అందులోనే ఓ కంప్యూటర్‌ను ఏర్పాటు చేసుకుని, తన ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. టెక్నాలజీ రంగంలో మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ సంఖ్య తక్కువగా ఉందని వైశాలి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చదివే అమ్మాయిల సంఖ్య ఎక్కువగానే ఉన్నా టెక్నాలజీ ఊతంగా వ్యాపారరంగంలోకి వచ్చే మహిళలు మాత్రం తక్కువమందే ఉన్నారు. చదువు పూర్తి చేయడం, అది పూర్తికాగానే వివాహం చేసుకోవడం అనే కానె్సప్ట్ వల్లే బహుశా అమ్మాయిలు చాలామంది వ్యాపారరంగంలో స్థిరపడటం లేద’న్నది వైశాలి అభిప్రాయం. ఈ రంగంలో మహిళలను ఎక్కువమందిని చూడాలంటే ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉంటుందంటున్న వైశాలి, భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని ‘యువ’ ఆశిస్తోంది.
*