యువ

యాప్ ఆయే..బహార్ ఆయే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒరేయ్..ఆ పుస్తకం ఇటు పట్రా..
అందులో ఓ అడ్రస్ రాసి ఉంది..
ఆ డాక్టర్ దగ్గరకి వెళ్లాలి..
***
ఉన్నదాన్ని ఎప్పుడు ఉన్నచోట ఉంచరు.
నేను రాసుకున్న డైరీ ఏమైంది..?
అందులో ఓ రచయిత వివరాలు ఉన్నాయి...
***
అమ్మాయిని ఏ స్కూలులో చేర్చాలో తెలియడం లేదు
అసలు ఎక్కడ ఎలా చెబుతారో పిల్లల్ని చేర్చేదాకా అంతేబట్టదు..
***
ఇవన్నీ మన నిత్య జీవితంలో ఒకప్పటి సమస్యలు. చిరునామా రాసుకున్న పుస్తకం దొరికితే తప్ప ఆ వైద్యుడెవరో..అతడి చిరునామా ఏమిటో తెలియదు
***
ఇక రచయితల వివరాలు దొరకడం అంటే ఒక పట్టాన సాధ్యం కాదు..ఆ పుస్తకం పోతే..అడ్రస్ శాశ్వతంగా గల్లంతే..!
***
ఇక స్కూళ్లంటారా..అన్ని ప్రచారంలో ఆరితేరిపోయాయి..మన అవసరాలేమిటి..మన స్థోమత ఏమిటన్న దానితో నిమిత్తం లేకుండా ఇబ్బడిముబ్బడిగా అంతా వెలిశాయి..వీటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలన్నది అష్టావధానం చేస్తే తప్ప సాధ్యం కాదు..
***
ఇలాంటి సమస్యలకే కాదు..వీటిని తలదనే్న వందల వేల సమస్యలకు చిటికెలో పరిష్కారాన్ని అందించే రోజులొచ్చేశాయి. ఏ సమాచారమైనా క్షణాల్లో మీ కళ్ల ముందు కదలాడే సూక్ష్మ ప్రపంచం సాక్షాత్కరించింది. మునివేళ్లపై కోరుకున్న సమాచారాన్ని కోకొల్లలుగా ప్రత్యక్షం చేసుకోగలిగే ఈ దివ్య ప్రపంచమే యాప్.. ఇందులో ఉన్నవి రెండే అక్షరాలు..కానీ అవి భూమ్యాకాశాలను అరచేతిలో ఇమిడ్చేసే సమాచార భాండాగారం.
స్మార్ట్ ఫోన్ ఉండటం ఇప్పుడు గొప్ప కాదు..అందులో ఎన్ని యాప్‌లు ఉన్నాయన్నదే నేటి జీవన శైలి. కంప్యూటర్ల స్థానే ట్యాబ్‌లు..ఆ ట్యాబ్‌ల స్థానంలో స్మార్ట్ ఫోన్లు రావడం ప్రపంచ వ్యాప్తంగా జన జీవితాన్ని, జీవనాన్ని అనూహ్యంగా మార్చేస్తే..ఇప్పుడు చిటికెలో పరిష్కారం అన్నట్టుగా వందలు, వేల సంఖ్యలో పుట్టుకొస్తున్న యాప్‌లు మనిషి ఆలోచనా రీతిలోనే నవ్యతను తీసుకొచ్చాయి. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ఫోన్‌లలో ఇమిడిపోయే లెక్కకు మిక్కిలి యాప్‌లు ప్రతి ఒక్కరినీ నడిచే సమాచార నిఘంటువులుగా మార్చేస్తున్నాయి. మరొకరిపై ఆధార పడకుండా ఎవరి అవసరాలు వారు తీర్చేసుకునే సులభ మార్గాన్ని అందించిన యాప్‌లు సమీప భవిష్యత్‌లో మానవ జీవితాలను విప్లవాత్మక రీతిలో ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఎందుకు యాప్‌ల కింత ప్రాచుర్యం..రాత్రికి రాత్రే ఉద్భవించాయన్నట్టుగా టెక్నాలజీ సహకారంలో ఇంతగా ఇవి ప్రపంచానే్న గుప్పిట పట్టేయడం ఎలా సాధ్యమైంది. ఇదంతా మనిషి మే ధస్సు అన్ని అవరోధాలనూ దాటి జగత్‌జ్జేయంగా నిలుస్తోందనడానికి నిదర్శనం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నా..ఐ ఫోన్ ఉన్నా.. ఎన్నో, ఎనె్నన్నో యాప్‌లను అందిపుచ్చుకోవచ్చు. అన్నింటా మీకు మీరే సాటి అన్నట్టుగా మిమ్మల్ని మీరే తీర్చిదిద్దుకోవచ్చు. ఫొటోగ్రాఫరూ మీరే..దాన్ని ఎడిట్ చేసే ఎడిటరూ మీరే..ఇలా మన సొంత అవసరాల కోసం ఇంకొకరిపై ఆధారపడకుండా ముందుకు దూసుకుపోయే సమాచార ప్రపంచాన్ని ఈ యాప్‌లు బంధించాయి. మీట నొక్కితే దేన్నయినా అ మ్మచ్చు..దేన్నయినా కొనొచ్చు..ఏది కావాలంటే అది క్షణాల్లో అందుబాటులోకి రావడానికి యాప్‌ల వల్ల కలుగుతున్న సౌల భ్యం అంతా ఇంతా కాదు. ఒక్కో స్మార్ట్ ఫోన్‌లో వందకు పైగా యాప్‌లను నిక్షిప్తం చేసుకునే అవకాశం ఉంది. అంతూ పొం తూ లేని విధంగా అన్ని రకాల దైనందిన అవసరాలకూ యా ప్‌లు పుట్టుకొస్తున్నాయి. విమానాలు, బస్సులు, రైళ్లు, కూరగాయలు, మార్కెట్లు, వైద్యుల వివరాలు, నిపుణుల సమాచారం, రోదసీ విజ్ఞానం..ఇలా ఒకటేమిటి యాప్‌ను అందిపుచ్చుకోవాలే గానీ అంతా అరచేతిలో ఉన్నట్టే..మానవ జీవనంపైనే కాదు, దైనందిన జీవన శైలినీ యాప్ మార్చేసింది. అందుకే యాప్ ఆయే బహార్ ఆయే అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు!

-బి.సుధ